Homeజాతీయ వార్తలుమద్దతు ధరకు చట్టం చేయనిది వారికోసమేనా..?

మద్దతు ధరకు చట్టం చేయనిది వారికోసమేనా..?

Support Price
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో రైతుల చేస్తున్న ఆందోళన తారస్థాయికి చేరింది. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు అన్నదాతలు. ధర్నా చేస్తున్న వారిలో ఇప్పటి వరకూ 20 మంది రైతులు చనిపోయారు. అయినా కూడా శాంతియుతంగాానే నిరసన తెలుపుతున్నారు. నిన్నామొన్నటి దాకా రైతులతో చర్చలు అంటూ సానుకూలంగాా ఉన్నట్టు వ్యవహరించిన ప్రభుత్వం ఇప్పుడు… ప్లేటు ఫిరాయిస్తోంది.

Also Read: ‘ట్విట్టర్ కిల్లర్’కు మరణ శిక్ష

వేర్పాటు వాద ముద్ర..
సవరణలు కాదు.. చట్టాల్ని రద్దు చేయాలని, అప్పటి వరకూ ఆందోళన విరమించేది లేదని రైతులు తేల్చి చెప్పడంతో.. ప్రభుత్వం వారిపై వేర్పాటు వాద ముద్ర వేస్తోంది. ఓ సారి ఖలిస్తాన్ అని.. మరోసారి చైనా, పాకిస్తాన్ వారి వెనక ఉన్నాయంటూ కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు మాట్లాడటం ప్రారంభించారు. మేధావులు, ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్న ఇతరులు.. మద్దతు ధరపై కేంద్రం చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: చంద్రబాబు వద్దు.. జగన్ తోనే బీజేపీ ఫ్రెండ్ షిప్?

కార్పొరేట్ల కోసమేనాా..?
రైతులు ఇంతగా ఆందోళన చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గట్లేదు అన్నది ప్రశ్న. ప్రస్తుతం కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల్లో కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన నిబంధనలు ఉన్నాయి. వాటితో ఏమైనా వివాదాలు ఏర్పడితే.. సామాన్య రైతు న్యాయం పొందడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కనీస మద్దతు ధరకు చట్టం చేయాలని రైతులు కోరుతున్నారు. రైతుల వద్దకు ఎవరైనా వచ్చి కొనుగోలు చేయనీవండి.. కానీ ఆ కొనుగోలు ఖచ్చితంగా మద్దతు ధర ప్రకారం జరగాలన్నది రైతుల న్యాయమైన డిమాండ్. దీనికి.. కేంద్రం అంగీకరించట్లేదు. వాస్తవానికి కార్పొరేట్ సంస్థలు చేసేది వ్యాపారం. కేవలం సొంత లాభమే వారి టార్గెట్. మిగతా వాళ్లు ఎక్కడైనాా పోనీ.. వారి లాభం వారికి వస్తే చాలన్నది అందరికీ తెలిసిందే. కేంద్రం మద్దతు ధరపై చట్టం చేస్తే.. రైతును దోచుకోవడం కార్పొరేట్లకు సాధ్యం కాదు. అందుకే.. ప్రభుత్వం ఈ చట్టం చేయట్లేదని రైతులు, మేధావులు విమర్శిస్తున్నారు. కేంద్రం ప్రజల తరపున పనిచేస్తోందో.. కార్పొరేట్ల కోసం పనిచేస్తోందో.. ఈ విషయమే చెబుతోందని అంటున్నాారు. ఈ విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version