Jobs: సొంతూరులో ఉద్యోగాలు.. 7వ తరగతి చదివితే చాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!

ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా.. ఉన్న ఊరిలోనే ఉద్యోగం చేయాలనుకుంటున్నారా.. పెద్దగా విద్యార్హత కూడా లేదా. అయితే ఈ వార్త మీకోసమే. 7వ తరగతి చదివితే చాలు.. ఉన్న ఊరిలోనే ఉద్యోగం చేయొచ్చు. ఆసక్తి, అర్హత గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు మండల పరిధి గ్రామాలకు చెందిన వారై ఉండాలి.

Written By: Raj Shekar, Updated On : August 3, 2024 3:48 pm

Jobs

Follow us on

Jobs: దేశంలో బలహీనవర్గాల బాలికలు, అనాథ బాలికలకు ఉచితంగా విద్య, భోజనం, వసతితోపాటు అనేక సౌకర్యాలతో కేంద్రం కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలను ఏర్పాటు చేసింది. 2004 నుంచి ఈ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. షెడ్యూల్డ్‌ కులాలు,షెడ్యూల్‌ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు,మైనారిటీవర్గాలు, దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు చెందిన బాలికలకు విద్యా సౌకర్యాలు అందించడానికి సర్వ శిక్షా అభియాన్‌ కార్యక్రమంలో ఇది విలీనం చేయబడింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎంతో మంది బాలికలు ఈ విద్యాలయాల్లో చదువుకుంటున్నారు. ఈ పాఠశాలల్లో చాలా మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్నారు. బోధన, బోధనేతర సిబ్బంది కూడా ఇదే విధానంలో విధులు నిర్వహిఐస్తున్నారు. ఖాళీ అయిన పోస్టులకు పాఠశాలల వారీటా నోటిఫికేషన్‌ ఇచ్చి.. భర్తీ చేస్తుంది. తాజాగా వరంగల్‌ జిల్లాలోని పర్వతగిరి మండల కేంద్రంలో ఉన్నటువంటి కస్తూరిబా బాలికల గురుకుల విద్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఎంఈవో సత్యనారాయణ, నోడల్‌ ఆఫీసర్‌ లింగారెడ్డి తెలిపారు. విద్యాలయంలో నైట్‌వాచ్‌ ఉమెన్, స్వీపర్‌ కం స్కావెంజర్, హెడ్‌ కుక్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.

అర్హతలు ఇవీ..
దరఖాస్తులు చేసుకునే మహిళలు పర్వతగిరి మండలానికి చెందిన వారై ఉండాలి.18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలని వివరించారు. నైట్‌వాచ్‌ ఉమెన్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి పాసై ఉండాలి. సెక్యూరిటీ ఏజెన్సీలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇక హెడ్‌ కుక్‌ పోస్టుకు కూడా పదో తరగతి పాస్‌అయి ఉండాలి. స్వీపర్‌ కం స్కావెంజర్‌ పోస్టుకు 7వ తరగతి పాసై ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత పత్రాలతో ఆగస్టు 4 తేదీల్లోగా సంబంధిత పాఠశాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌ నజియా సల్మాను 7680946704 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

దుగ్గొండి మండలంలో..
దుగ్గొండి మండలం మల్లంపల్లిలోని కస్తూరిబా విద్యాలయంలో ఖాళీగా ఉన్నా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని మండల విద్య శాఖ అధికారి తెలిపారు. డే వాచ్‌ ఉమెన్, స్కావెంజర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆసక్తి, అర్హత గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు చేసుకున్న మహిళలు మండల పరిధి గ్రామాలకు చెందిన వారై ఉండాలని తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్కావెంజర్‌ కు 7వ తరగతి చదివి ఉండాలన్నారు మహిళలు 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు కస్తూరిబా విద్యాలయంలో ఆగస్టు 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.