ఆయిల్ పేపర్ గొడుగులు: భిన్నమైన సంస్కృతికి పేరు పొందిన చైనాలో ప్రతిదీ విచిత్రంగానే ఉంటుంది. ఆ దేశంలో ఆయిల్ పేపర్ గొడుగులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయిల్ పేపర్ తో తయారు చేసిన గొడుగులతో ఇలా అలంకరించారు. Photo: X
నువ్వే కాపాడాలయ్యా: గ్రీకు దేశస్తులు పోసి డాన్ ను సముద్రానికి అధిపతిగా భావిస్తారు. మెక్సికోలో బెరిల్ ప్రాంతాన్ని తుఫాన్ ముంచెత్తడంతో.. ఆ ప్రభావాన్ని తగ్గించాలని ఇలా సముద్ర తీరంలో పోసి డాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.. Photo: X
రికార్డు స్థాయి ఎండలు: ఈసారి డెత్ వ్యాలీలో ఉష్ణోగ్రతలు ఒక రేంజ్ లో నమోదవుతున్నాయి. ఇక్కడి నేషనల్ పార్క్ లో ఉన్న విజిటర్ సెంటర్ కు పర్యాటకులు పోటెత్తుతున్నారు. అక్కడి మీటర్ రీడర్ పక్కన ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. Photo: X
నది మధ్యలో వాలీబాల్: వాటర్ వాలీబాల్ క్రీడకు ప్రాచుర్యం పెంచేందుకు లూబియానా ప్రాంతంలో నది మధ్యలో టోర్నీ నిర్వహించారు. పోటీలలో మహిళ క్రీడాకారుణులు హోరాహోరీగా తలపడ్డారు. Photo: X
వన్యప్రాణులు పరిగెడుతున్నాయి: ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో మార్పుల వల్ల భయపడి పారిపోతున్న వన్యప్రాణుల థీమ్ తో లండన్ వింబుల్డన్ ఆర్ట్స్ కాలేజీలో ది హెర్ట్స్(మందలు) పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో కదిలే బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. Photo: X