కరోనా అలర్ట్.. అక్కడ నవంబర్ 30 వరకు స్కూల్స్ బంద్..?

భారత్ లో కరోనా మహమ్మరి విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా తగ్గినట్టే తగ్గీ మళ్లీ విజృంభిస్తోంది. దేశరాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో మళ్లీ లాక్ డౌన్ ను అమలు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరోవైపు శాస్త్రవేత్తలు దేశంలో సెకండ్ వేవ్ మొదలవుతుందని హెచ్చరిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని స్కూళ్లను […]

Written By: Navya, Updated On : November 20, 2020 8:06 pm
Follow us on


భారత్ లో కరోనా మహమ్మరి విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా తగ్గినట్టే తగ్గీ మళ్లీ విజృంభిస్తోంది. దేశరాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో మళ్లీ లాక్ డౌన్ ను అమలు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరోవైపు శాస్త్రవేత్తలు దేశంలో సెకండ్ వేవ్ మొదలవుతుందని హెచ్చరిస్తున్నారు.

కరోనా సెకండ్ వేవ్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని స్కూళ్లను ఈ నెల 30 వరకు మూసివేస్తున్నట్టు కీలక ప్రకటన చేసింది. హర్యానా ప్రభుత్వం స్కూల్స్ బంద్ చేయడానికి ముఖ్యమైన కారణమే ఉంది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభించింది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో హర్యానా సర్కార్ స్కూళ్లపై ఆంక్షలు విధించింది.

అక్కడి వైద్యులు కరోనా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సెకండ్ వేవ్‌ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుతాన్ని హెచ్చరించారు. మరోవైపు హర్యానాలో నిన్న ఒక్కరోజే 2,212 కొత్త కేసులు నమోదు కాగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,09,251కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,113 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. మొదటి నుంచి కరోనా విజృంభించకుండా హర్యానా సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటోంది.

మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో తెలంగాణలో 954 కరోనా కేసులు నమోదు కాగా ఏపీలో 1221 కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలలో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.