హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..?

దశాబ్ద కాలం క్రితం పెద్దపెద్ద ఉద్యోగాలు చేసేవాళ్లు, వ్యాపారులు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపేవాళ్లు. అయితే మారిన కాలంతో పాటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో రోజురోజుకు కొత్తకొత్త వ్యాధులు పుట్టుకొస్తున్న నేపథ్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. రోజురోజుకు వైద్య ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి. తక్కువ మొత్తం ప్రీమియం చెల్లించి వ్యాధుల బారిన పడినా […]

Written By: Kusuma Aggunna, Updated On : November 20, 2020 8:00 pm
Follow us on


దశాబ్ద కాలం క్రితం పెద్దపెద్ద ఉద్యోగాలు చేసేవాళ్లు, వ్యాపారులు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపేవాళ్లు. అయితే మారిన కాలంతో పాటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో రోజురోజుకు కొత్తకొత్త వ్యాధులు పుట్టుకొస్తున్న నేపథ్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. రోజురోజుకు వైద్య ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి.

తక్కువ మొత్తం ప్రీమియం చెల్లించి వ్యాధుల బారిన పడినా లక్షల రూపాయలు ఖర్చు కాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. బీమా కంపెనీలు సైతం ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కొత్తకొత్త పాలసీలను అందుబాటులోకి తెస్తూ ఉండటం గమనార్హం. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకునే ముందు పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను, పాలసీ ప్రయోజనాలను పూర్తిగా తెలుసుకోవాలి.

సరైన అవగాహన లేకుండా పాలసీలను తీసుకుంటే లాభం పొందే కంటే నష్టపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. పాలసీ తీసుకున్న తరువాత సంవత్సర కాలంలో ఆ పాలసీని వినియోగించుకోకపోతే పాలసీ తీసుకున్నవాళ్లకు బీమా సంస్థలు క్యుములేటివ్ బోనస్ ను ప్రకటిస్తున్నాయి. నిర్ణీతమొత్తంలో ప్రయోజనం చేకూర్చే పాలసీల కంటే అపరిమితంగా ప్రయోజనం చేకూర్చే పాలసీలను తీసుకుంటే మంచిది.

బీమా సంస్థలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్లకు సాధారణంగా ఇచ్చే ప్రయోజనాలతో పాటు మరికొన్ని ప్రయోజనాలను కూడా కల్పిస్తున్నాయి. పలు సంస్థలు ఆరోగ్య పరీక్షలు, మందుల కొనుగోలులో రాయితీలను కల్పిస్తూ ఉండటం గమనార్హం.