కరోనా గురించి షాకింగ్ న్యూస్.. ఊరు మొత్తానికి పాజిటివ్..?

దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు, కరోనా మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే కరోనా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంత ప్రమాదమో ఒక ఘటన చెప్పకనే చెబుతోంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తోరాంగ్ అనే గ్రామంలో నివశించే వాళ్లంతా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆ గ్రామం జనాభా 42 కాగా 41 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే ఒక వ్యక్తి మాత్రం కరోనా బారిన పడకుండా […]

Written By: Navya, Updated On : November 20, 2020 8:35 pm
Follow us on


దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు, కరోనా మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే కరోనా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంత ప్రమాదమో ఒక ఘటన చెప్పకనే చెబుతోంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తోరాంగ్ అనే గ్రామంలో నివశించే వాళ్లంతా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆ గ్రామం జనాభా 42 కాగా 41 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.

అయితే ఒక వ్యక్తి మాత్రం కరోనా బారిన పడకుండా నాలుగు రోజులు క్వారంటైన్ లో ఉండటంతో తనను తాను రక్షించుకోగలిగాడు. ఆ వ్యక్తి కూడా క్వారంటైన్ లో ఉండకుండా ఉంటే పాజిటివ్ నిర్ధారణ అయ్యేది. పూర్తి వివరాల్లోకి వెళితే హిమాచల్ ప్రదేశ్ లోని లాహాల్ లోయలోని తోరాంగ్ మనాలి హైవే దగ్గర ఉన్న గ్రామానికి చెందిన 42 మంది నివాసితులు ఉన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో గ్రామస్తులు స్వచ్చందంగా పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

అలా మొత్తం 42 మందిని పరీక్షించగా 41 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఒక వ్యక్తి మాత్రం ప్రత్యేక గదిలో ఉండటంతో పాటు సొంతంగా భోజనం వండుకుని తిన్నాడు. ఆ ఒక్క వ్యక్తి కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకినప్పటికీ తాను వాళ్లతో బయటకు వెళ్లిన సమయంలో కరోనా నిబంధనలు పాటించానని చెప్పారు. గ్రామస్తులంతా మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడంతో కరోనా సోకినట్లు తెలుస్తోంది.

శాస్త్రవేత్తలు, వైద్యులు కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రజలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని నిబంధనలు ఉల్లంగిస్తే వైరస్ బారిన పడే అవకాశం ఉందని సూచనలు చేశారు.