Group 2 Notification: ప్రభుత్వాలు ఇటీవల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు ఉచితంగా శిక్షణ కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. గతంలో పోలీస్, డీఎస్సీ, ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భంగా జిల్లాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకున్న పలువురు కొలువులు కూడా సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఓ సంస్థ ముందుకు వచ్చింది. శిక్షణతోపాటు స్టైఫండ్ కూడా ఇవ్వాలని నిర‍్ణయించింది.
ప్రిలిమ్స్‌లో ప్రతిభ చాటిన అభ్యర్థులకు..
ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ఇటీవల జరిగింది. ఫలితాలు కూడా వచ్చాయి. ప్రిలిమ్స్‌లో ప్రతిభ కనబర్చిన ఉమ్మడి తిరుపతి జిల్లా జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తిరుపతి అర్బన్ పట్టణలోని బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షన ఇవ‍్వనున్నట్లు సంచాలకులు డి.భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బయోడేటాతోపాటు గ్రూప్-2 హాల్‌టికెట్, ఎసె‍్సస్సీ, ఇంటర్, డిగ్రీ మెమో, కులం, ఆదాయం ధ్రువపత్రాలు, బ్యాంకు పాస్‌బుక్, 2 పాస్‌పోర్టుసైజు ఫొటోలు, ఆధార్ కార్డుతో మే 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను ఎమ్ఆర్ పల్లిలోని బీసీ స్టడీ సర్కిర్‌లో అందించాలని తెలిపారు.
60 రోజులు శిక్షణ..
అడ్మిషన్ పొందిన అభ్యర్థులకు 60 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు ప్రభుత్వం నుంచి స్టైఫండ్ కూడా అందిస్తామని సంచాలకులు భాస్కర్‌రెడ్డి తెలిపారు. వివరాలకు 93462 21553, 94414 56039 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Good news for group 2 candidates free training monthly stipend
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com