https://oktelugu.com/

Jobs: డిగ్రీ పాసైనవాళ్లకు శుభవార్త.. ఏపీలో 730 ప్రభుత్వ ఉద్యోగాలు?

Jobs: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 730 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. మొత్తం ఉద్యోగ ఖాళీలలో 670 జూనియర్‌ అసి స్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు 60 ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారని సమాచారం. ఈ నెల 30వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 31, 2021 / 12:29 PM IST
    Follow us on

    Jobs: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 730 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

    కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. మొత్తం ఉద్యోగ ఖాళీలలో 670 జూనియర్‌ అసి స్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు 60 ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారని సమాచారం.

    Jobs

    ఈ నెల 30వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2022 సంవత్సరం జనవరి 19వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. psc.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ రెవెన్యూ, ఏపీ ఎండోమెంట్స్‌ విభాగాలలో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగ ఖాళీల వల్ల నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది చెప్పవచ్చు. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

    Also Read:  పీఆర్సీపై తేలని పంచాయితీ.. అసంపూర్తిగా ముగిసిన చర్చలు

    కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌, రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.

    ఈ ఉద్యోగ ఖాళీలు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు కావడంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు మేలు జరిగేలా కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వరుసగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది.

    Also Read:  సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో జాబ్స్.. భారీ వేతనంతో?