ఏపీ విద్యార్థులకు శుభవార్త.. ఒక పూట మాత్రమే బడి!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్కూళ్ల రీఓపెన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో చెప్పిన విధంగా రాష్ట్రంలో నవంబర్ 2వ తేదీ నుంచి స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు స్కూళ్ల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయాలను ప్రకటించారు. అధికారులతో స్కూళ్ల నిర్వహణకు సంబంధించి అనేక విషయాల గురించి చర్చలు జరిపి స్కూళ్లు ఓపెన్ చేయబోతున్నట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో వేసవి కాలం మాదిరిగా ఒకపూట మాత్రమే క్లాసులు జరుగుతాయని వ్యాఖ్యలు చేశారు. గతంలో […]

Written By: Navya, Updated On : October 20, 2020 8:49 pm
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్కూళ్ల రీఓపెన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో చెప్పిన విధంగా రాష్ట్రంలో నవంబర్ 2వ తేదీ నుంచి స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు స్కూళ్ల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయాలను ప్రకటించారు. అధికారులతో స్కూళ్ల నిర్వహణకు సంబంధించి అనేక విషయాల గురించి చర్చలు జరిపి స్కూళ్లు ఓపెన్ చేయబోతున్నట్టు సీఎం ప్రకటించారు.

రాష్ట్రంలో వేసవి కాలం మాదిరిగా ఒకపూట మాత్రమే క్లాసులు జరుగుతాయని వ్యాఖ్యలు చేశారు. గతంలో అమలైన మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వ పాఠశాలల్లో యథావిధిగా అమలవుతుందని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు క్లాసులు జరుగుతాయని.. ఆ తరువాత మధ్యాహ్న భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపే విధంగా చర్యలు చేపట్టాలని జగన్ అధికారులకు కీలక సూచనలు చేశారు.

వచ్చే నెల మాత్రమే ఈ నిర్ణయాల అమలు జరుగుతుందని.. పరిస్థితులను సమీక్షించి నిర్ణయాలలో మార్పులుచేర్పులు చేస్తామని జగన్ అన్నారు. 1,3,5,7 తరగతుల విద్యార్థులకు ఒకరోజున 2,4,6,8 తరగతుల విద్యార్థులకు మరో రోజున తరగతులను నిర్వహించాలని పేర్కొన్నారు. కరోనా విజృంభణ దృష్ట్యా జగన్ పరిమిత సంఖ్యలో మాత్రమే విద్యార్థులు స్కూళ్లకు హాజరు కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

విద్యాశాఖ ఒక ప్రకటనలో 750కు పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలు మూడు రోజులకు ఒకసారి నిర్వహించాలని.. తల్లిదండ్రులు విద్యార్థులను స్కూళ్లకు పంపడానికి సుముఖత వ్యక్తం చేయని పక్షంలో ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ సూచిస్తోంది.