
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందించింది. భారత ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన ఈ సంస్థ తాజాగా ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏకంగా 220 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. మేనేజర్, సీనియర్ ఇంజనీర్, సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగష్టు నెల 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, హెచ్‌ఆర్, లా, మార్కెటింగ్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ, సీఎంఏ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటారో గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి భారీ వేతనం లభిస్తుంది. నిరుద్యోగులకు వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల ప్రయోజనం చేకూరుతుంది.
ఈ నెల 7వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హత, అనుభవం ఆధారంగా వేతనాలు పెరుగుతాయి.