https://oktelugu.com/

విద్యార్థులకు కేంద్రం శుభవార్త.. ఫ్రీగా టాబ్లెట్స్‌, టెక్ట్స్‌ బుక్స్‌..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరే విధంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవోదయ విద్యా సమితి స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త చెప్పింది. నిన్న ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల నేతృత్వంలో కార్యవర్గ సమావేశం జరగగా ఈ సమావేశంలో మంత్రి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. నవోదయ స్కూళ్లలో చదివే విద్యార్థులకు టాబ్లెట్స్‌, టెక్ట్స్‌ బుక్స్ ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. Also Read: బీటెక్ పాసైన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 27, 2021 / 02:07 PM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరే విధంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవోదయ విద్యా సమితి స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త చెప్పింది. నిన్న ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల నేతృత్వంలో కార్యవర్గ సమావేశం జరగగా ఈ సమావేశంలో మంత్రి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. నవోదయ స్కూళ్లలో చదివే విద్యార్థులకు టాబ్లెట్స్‌, టెక్ట్స్‌ బుక్స్ ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

    Also Read: బీటెక్ పాసైన యువతులకు శుభవార్త.. ఏపీలో 100 ఉద్యోగాలు..?

    నవోదయ విద్యా సమితి స్కూళ్లలో చదివే విద్యార్థులందరికీ ఉచితంగా పుస్తకాల పంపిణీ జరగనుండగా 9, ఆపై తరగతుల విద్యార్థులకు మాత్రం ఉచితంగా టాబ్లెట్స్ పంపిణీ జరగనుంది. సమావేశంలో నవోదయ విద్యాలయ సమితికి సంబంధించి పలు అంశాలపై విసృతంగా చర్చ జరగగా ఈ సమావేశంలో మంత్రి రమేష్ తో పాటు విద్యాశాఖ సహాయ మంత్రి సంజయ్ దోత్రేతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. క్యాప్ జెమిని కంపెనీలో 30 వేల ఉద్యోగాలు..?

    సమావేశంలో సీఎస్‌ఆర్‌ నిధులతో స్కూళ్లు, హాస్టళ్ల పనితీరును మెరుగుపరచాలని నిర్ణయం తీసుకున్నారు. ఉచితంగా టాబ్లెట్స్ ఇచ్చే దిశగా కేంద్రం అడుగులు వేయడంపై నవోదయ విద్యా సమితి స్కూళ్లలో చదివే విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశంలో జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలో స్పెషల్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ గురించి కూడా చర్చ జరిగింది.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    నవోదయ విద్యాలయ సమితి కార్యవర్గ సమావేశం వచ్చే విద్యా సంవత్సరం నుంచి న్యూ ట్రాన్స్‌ఫర్ పాలసీని అమలులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్ కేడర్‌కు సంబంధించి నియామక నిబంధనలను సరిదిద్దబోతున్నట్టు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నవోదయ విద్యాసమితి పూర్వ విద్యార్థులు పాఠశాలలను దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.