వాట్సాప్ లో డిలీట్ అయిన మెసేజ్‌ లను చదవొచ్చు.. ఎలా అంటే..?

మన దేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉపయోగించే యాప్ లలో ఒకటైన వాట్సాప్ యాప్ లో డిలీట్ అయిన మెసేజ్ లను కూడా మళ్లీ చదవవచ్చు. కొన్ని ట్రిక్స్ పాటించడం ద్వారా డిలీట్ అయిన మెసేజ్ లను సులభంగా చదివే అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్లను వినియోగించే వాళ్లు గ్రూప్ లేదా పర్సనల్ చాట్ లో డిలేట్ అయిన మెసేజ్ లను సులభంగా చదవవచ్చు. Also Read: ‘ఉప్పెన’ హీరోయిన్ తో సుధీర్ ప్రేమ […]

Written By: Navya, Updated On : February 27, 2021 3:09 pm
Follow us on

మన దేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉపయోగించే యాప్ లలో ఒకటైన వాట్సాప్ యాప్ లో డిలీట్ అయిన మెసేజ్ లను కూడా మళ్లీ చదవవచ్చు. కొన్ని ట్రిక్స్ పాటించడం ద్వారా డిలీట్ అయిన మెసేజ్ లను సులభంగా చదివే అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్లను వినియోగించే వాళ్లు గ్రూప్ లేదా పర్సనల్ చాట్ లో డిలేట్ అయిన మెసేజ్ లను సులభంగా చదవవచ్చు.

Also Read: ‘ఉప్పెన’ హీరోయిన్ తో సుధీర్ ప్రేమ

డిలేట్ అయిన మెసేజ్ లను చదవాలని అనుకునే వాళ్లు ఇందుకోసం థర్డ్ పార్టీ అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. whatsremoved+ యాప్ సహాయంతో డిలేట్ అయిన మెసేజ్ లను చదవవచ్చు. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో ఈ ఆండ్రాయిడ్ యాప్ అందుబాటులో ఉంది. ఈ యాప్ ను వైఫై కనెక్షన్ ద్వారా కనెక్ట్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. యాప్ డౌన్ లోడ్ చేసుకున్న తరువాత టర్మ్స్ అండ్ కండీషన్స్ కు అంగీకరించాలి.

Also Read: ‘గాలి సంపత్’ ట్రైలర్ టాక్: ఫఫ్సా లాంగ్వేజ్ తో తండ్రీకొడుకుల సెంటిమెంట్

ఆ తరువాతా ఏ మెసేజ్ లు సేవ్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకుని ఆల్ డిలీటెడ్ మెసేజ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని కంటిన్యూపై క్లిక్ చేయాలి. ఆ తరువాత డిలీట్ మెసేజ్ లు సేవ్ చేయాలా? లేదా..? అని అడుగుతుంది. సేవ్ చేయాలని కోరితే డిలేట్ అయిన మెసేజ్ లు అన్నీ ఒకేచోట కనిపిస్తాయి. ఈ విధంగా సులభంగా డిలీట్ అయిన మెసేజ్ లను చదివే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు కోసం: వైరల్

మరోవైపు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి త్తెస్తూ యూజర్లకు మరింత చేరువ అవుతోంది. ఎన్నో మెసేజింగ్ యాప్ లు ఉన్నా వాట్సాప్ స్థాయిలో ఆ యాప్ లు ఆకట్టుకోలేకుండా ఉండటం గమనార్హం.