https://oktelugu.com/

అదనంగా డబ్బులు ఇస్తేనే ముద్దులు పెడతాను !

ఇచ్చే రెమ్యున‌రేష‌న్‌ ను బట్టే ఎక్స్ పోజింగ్ రేంజ్ ఉంటుంది, ఎంత ఎక్కువ రెమ్యున‌రేష‌న్‌ ఇస్తే.. అన్ని బోల్డ్ సీన్స్ చేస్తాను, లేదు అంటే.. అలాంటి సన్నివేశాల్లో నటించను అంటుంది ‘మిల్క్ బ్యూటీ తమన్నా’. హీరో నితిన్ స్టార్ట్ చేసిన సినిమాల్లో కాస్త భారీ అంచనాలు ఉన్న సినిమా బాలీవుడ్ సూపర్ హట్ మూవీ ‘అంధాదూన్’ ఒకటి. ఈ సినిమా హిందీలో విజయం సాధించడానికి గల ప్రధాన కారణాల్లో నెగెటివ్ రోల్ చేసిన ‘టబు’ పెర్ఫార్మెన్స్ అలాగే […]

Written By:
  • admin
  • , Updated On : December 10, 2020 / 05:28 PM IST
    Follow us on


    ఇచ్చే రెమ్యున‌రేష‌న్‌ ను బట్టే ఎక్స్ పోజింగ్ రేంజ్ ఉంటుంది, ఎంత ఎక్కువ రెమ్యున‌రేష‌న్‌ ఇస్తే.. అన్ని బోల్డ్ సీన్స్ చేస్తాను, లేదు అంటే.. అలాంటి సన్నివేశాల్లో నటించను అంటుంది ‘మిల్క్ బ్యూటీ తమన్నా’. హీరో నితిన్ స్టార్ట్ చేసిన సినిమాల్లో కాస్త భారీ అంచనాలు ఉన్న సినిమా బాలీవుడ్ సూపర్ హట్ మూవీ ‘అంధాదూన్’ ఒకటి. ఈ సినిమా హిందీలో విజయం సాధించడానికి గల ప్రధాన కారణాల్లో నెగెటివ్ రోల్ చేసిన ‘టబు’ పెర్ఫార్మెన్స్ అలాగే ఆమె చూపించిన అందచందాలే కీలకం. లేటు వయసులో కూడా టబు బోల్డ్ క్యారెక్టర్ లో ఎలాంటి మొహమాటం లేకుండా హద్దులు దాటి మరీ రెచ్చిపోయి నటించింది.

    Also Read: విజయ్ దేవరకొండకు లిప్ కిస్ ఇస్తానంటున్న తమన్నా

    కాగా తెలుగులోకి వచ్చే సరికి టబు చేసిన పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ బోల్డ్ క్యారెక్టర్ లో నటించడానికి తమన్నా కూడా పెద్ద మొత్తంలోనే డిమాండ్ చేసింది. ఎలాగూ రొమాంటిక్ సీన్స్ లో ఎలాంటి కండిషన్స్ లేకుండా నటించాలి కాబట్టి, ఆమె ఆడినంత ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నారు. షూటింగ్ ను మొదలుపెట్టారు. కానీ, షూట్ స్టార్ట్ చేసాకా నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది మిల్క్ బ్యూటీ. బెడ్ సీన్స్ లో నటించాలి అంటే.. ఎక్కువ రెమ్యున‌రేష‌న్‌ ఇవ్వాల్సిందే అని మళ్ళీ ఎక్కువ మొత్తాన్నే అడిగి తీసుకుంది. ఇప్పుడు, ముద్దు సన్నివేశాల్లో కూడా అదనంగా డబ్బులు ఇస్తేనే ముద్దులు పెడతాను.. అని తాజాగా కండిషన్ పెట్టిందట.

    Also Read: రామ్ చరణ్ కొత్త సినిమా ఓపెనింగ్ డేట్ ఫిక్స్ !

    ఎంత కాదు అనుకున్నా తమన్నా ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. పైగా సైరా, బాహుబలి లాంటి భారీ సినిమాల కథానాయిక, అన్నిటికి మించి స్టార్ హీరోల సరసన ఆడిపాడిన స్టార్ హీరోయిన్ అయ్యే. అసలు ప్రత్యేక గీతాల్లో నటించే కోట్లల్లో తీసుకునే తమన్నా.. సినిమా మొత్తం బోల్డ్ గా నటించాలి అంటే.. ఆ మాత్రం డిమాండ్ చేస్తోంది కదా.. పైగా అమెది నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయ్యే. అందుకే ఈ చిత్రం కోసం తమన్నా సుమారు రెండు కోట్లు వరకు అడిగి తీసుకుంది. ఇంకా అడుగుతూనే ఉంది. ఇక ఈ చిత్రంలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్