https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త… ఏపీలో 575 గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలు..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ సర్కార్ కడప జిల్లాలో 575 గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పదో తరగతి పాసైన స్థానిక గ్రామపంచాయితీ పరిధిలో నివశిస్తున్న వాళ్లు గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్ కడప జిల్లాకు చెందిన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 3, 2020 / 07:33 PM IST
    Follow us on


    ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ సర్కార్ కడప జిల్లాలో 575 గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పదో తరగతి పాసైన స్థానిక గ్రామపంచాయితీ పరిధిలో నివశిస్తున్న వాళ్లు గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    కడప జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈ నెల 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ లో సరైన వివరాలను పొందుపరిచి ధ్రువీకరణ పత్రాలను అప్ లోడ్ చేసి ఈ ఉద్యోగాలకు సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. గత అనుభవం, ప్రస్తుత ప్రభుత్వ పథకాలపై అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://gswsvolunteer.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    Also Read: జగన్ సర్కార్ పై మరోసారి హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

    జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత 2.70 లక్షల గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి ఇంటర్వ్యూల ద్వారా వారిని ఎంపిక చేసింది. ప్రభుత్వం గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలను కల్పించడం వల్ల రాష్ట్రంలోని యువతకు పెద్దఎత్తున ఉపాధి లభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ గ్రామ, వార్డ్ వాలంటీర్ల ద్వారానే అమలవుతున్నాయి.

    Also Read: జగన్‌కు తలనొప్పిలా మారిన ఆ ఇద్దరు నేతలు

    ప్రభుత్వం గ్రామ, వార్డ్ వాలంటీర్లకు 5,000 రూపాయల చొప్పున వేతనం చెల్లిస్తోంది. https://apgv.apcfss.in/notificationpublicreport.do ద్వారా నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.