Government Jobs: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్ సీ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 5 గ్రూప్ సీ సివిలియన్ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలలో కుక్ (ఓజీ) ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. మొత్తం 5 ఉద్యోగ ఖాళీలలో ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఏఎఫ్ స్టేషన్ బీదర్‌లో రెండు జాబ్స్ ఉండగా కమాండెంట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్‌లో మూడు జాబ్స్ ఉన్నాయి.
2022 సంవత్సరం జనవరి 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2022 సంవత్సరం జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఆన్ లైన్ అబ్జెక్టివ్ పరీక్ష జరుగుతుంది. మొత్తం 641 పోస్టులలో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 286 సీట్లు ఉన్నాయి.
Also Read: నార్త్ సెంట్రల్ రైల్వేలో గ్రూస్ సీ జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
ఈ ఉద్యోగ ఖాళీలు కాకుండా ఓబీసీ కేటగిరీలో 133 సీట్లు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 61 సీట్లు, ఎస్సీ కేటగిరీలో 93 సీట్లు, ఎస్టీ కేటగిరీలో 68 సీట్లు ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. రిజర్వేషన్ల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా ఉండగా ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 300 రూపాయలుగా ఉంది.
నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.
Also Read: సెంట్రల్ బ్యాంకులో 214 ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?