కరోనా అలర్ట్.. ఆ ప్రాంతంలో 192 మంది విద్యార్థులకు పాజిటివ్..?

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గినా ప్రజల్లో కరోనా మహమ్మారి భయాందోళన ఏ మాత్రం తగ్గడం లేదు. కరోనా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే వైరస్ బారిన పడే అవకాశం ఉండటంతో పాటు ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతోంది. పలు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరిచిన నేపథ్యంలో కరోనా విషయంలో తగిన జాత్రత్తలు తీసుకోని పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. కేరళలోని రెండు పాఠశాలల్లో 192 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది. కరోనా వైరస్ నిర్ధారణ అయిన విద్యార్థులంతా […]

Written By: Navya, Updated On : February 10, 2021 2:19 pm
Follow us on

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గినా ప్రజల్లో కరోనా మహమ్మారి భయాందోళన ఏ మాత్రం తగ్గడం లేదు. కరోనా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే వైరస్ బారిన పడే అవకాశం ఉండటంతో పాటు ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతోంది. పలు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరిచిన నేపథ్యంలో కరోనా విషయంలో తగిన జాత్రత్తలు తీసుకోని పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. కేరళలోని రెండు పాఠశాలల్లో 192 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది.

కరోనా వైరస్ నిర్ధారణ అయిన విద్యార్థులంతా ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది. కేరళలోని మ‌లప్పురంలో కరోనా సోకిన విద్యార్థులలో 149 మంది ఒకే పాఠశాలకు చెందిన విద్యార్థులు కాగా 43 మంది విద్యార్థులు వేరే పాఠశాలకు చెందినవారు. వీరిలో 91 మంది ఒకే ట్యూషన్ కు చెందిన విద్యార్థులు కావడంతో ట్యూషన్ లోనే ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాప్తి చెందిందని తెలుస్తోంది. పోలీసులు విద్యార్థులకు కరోనా సోకడంతో తాత్కాలికంగా ట్యూష‌న్ సెంట‌ర్‌ ను క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది. విద్యార్థులతో పాటు సిబ్బందికి కూడా కరోనా సోకింది.

టీచర్లు, ఇతర సిబ్బందిలలో 72 మంది కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. డాక్ట‌ర్ కే స‌కీనా ట్యూషన్ కు వెళ్లే విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించబోతున్నట్టు తెలిపారు. స్కూళ్లు, ట్యూషన్ కు సమీపంలో ఉన్న విద్యార్థులు, టీచర్లకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. పాఠశాలలు తెరిచిన తరువాత ఈ స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

పాఠశాలల్లో కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇతర పాఠశాలల్లో కూడా భారీగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.