
ECIL Recruitment 2021: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. 243 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 243 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఈ ఉద్యోగ ఖాళీలు ఉండగా నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ నోటిఫికేషన్ లో వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
టర్నర్, మెషనిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్ ఉద్యోగాలతో పాటు ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఉద్యోగ ఖాళీలు కేవలం ఏడాది వ్యవధి గల అప్రెంటీస్ పోస్టులు కావడం గమనార్హం. http://www.ecil.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.
పది అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాస్ అయిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 7,700 రూపాయల నుంచి 8050 రూపాయల వరకు వేతనం లభించనుంది. సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 25వ తేదీల వరకు ఈ ఉద్యోగాలకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది.
అక్టోబర్ నెల 9వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు జాయిన్ కావాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం అక్టోబర్ 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://apprenticeshipindia.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు రిజిష్టర్ చేసుకోవాలి.