
తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. ఈనెల 17వ తేదీన రాష్ట్రానికి అమిత్ షా రానున్నట్లు ఎంపీ సోయం బాపూరావు ప్రకటించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్ వెయ్యి ఊడల మర్రి వద్ద సభకు భాజపా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్ షా పర్యటన రోజు బండి సంజయ్ పాదయాత్రకు విరామమిచ్చి బహిరంగ సభలో పాల్గొంటారు.