ఇంటర్ పాసైన వాళ్లకు శుభవార్త.. రూ.35,000 వేతనంతో జాబ్స్..?

యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ సంస్థ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 51 మైనింగ్ మేట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఇంటర్ పాసైన విద్యార్థులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వారికి దాదాపు రూ.35,000 వేతనం లభిస్తుంది. http://www.ucil.gov.in/ వెబ్ […]

Written By: Navya, Updated On : May 26, 2021 9:07 am
Follow us on

యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ సంస్థ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 51 మైనింగ్ మేట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఇంటర్ పాసైన విద్యార్థులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వారికి దాదాపు రూ.35,000 వేతనం లభిస్తుంది.

http://www.ucil.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంటర్ అర్హతతో పాటు డీజీఎంఎస్‌ జారీ చేసిన మెటాలిఫెరస్‌ మైన్స్‌ మైనింగ్‌ మేట్‌ కాంపిటెన్సీ సర్టిఫికెట్‌ కచ్చితంగా ఉండాలి.

కనీసం సంవత్సరం అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్థానిక భాష చదవడం, రాయడంలో ప్రొఫీషియన్సీ ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారు. 2021 సంవత్సరం ఏప్రిల్ 30 నాటికి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వెలువడిన తేదీ నుంచి 20 రోజుల్లోపు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

http://www.ucil.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అర్హతలు ఇతర వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంటర్ పాసై అర్హతలు ఉన్నవాళ్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.