దేశంలో చాలామంది విద్యార్థులు తక్కువ వయస్సులోనే స్థిరపడాలని భావిస్తున్నారు. పదో తరగతి పాసైతే చాలు ఎన్నో ఉద్యోగాలకు అర్హత సాధించినట్టేనని చెప్పవచ్చు. ప్రముఖ సంస్థల్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో 20వేల రూపాయల నుంచి 30వేల రూపాయల వరకు వేతనం లభిస్తుండటం గమనార్హం. మెట్రిక్ రిక్రూట్ మెంట్ ద్వారా నేవీలో నేవీచెఫ్, స్టివార్డ్, శానిటరీ హైజీనిస్ట్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
అవివాహిత పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి 21,700 రూపాయల వేతనం లభిస్తుంది. సంగీత పరికరాలపై ప్రావీణ్యం ఉన్నవాళ్లు నేవీ బ్యాండ్లలో మ్యూజీషియన్ గా కూడా పని చేయవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కానిస్టేబుల్, రైఫిల్ మేన్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుంది. ఈ ఉద్యోగాలలో ఎక్కువ ఉద్యోగాలు పది అర్హతతోనే లభించనున్నాయి.
18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పురుషులు, మహిళలు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. పదోతరగతి కనీసం 45 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఆర్మీ ఉద్యోగాలకు అర్హులు. రాతపరీక్ష, దేహదారుడ్య పరీక్షల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రైల్వేలో పదో తరగతి పాసైన వాళ్ల కొరకు ట్రాక్ మెయింటైనర్ తో పాటు ఇతర ఉద్యోగ ఖాళీలున్నాయి.
పదో తరగతి అర్హతతో కోస్ట్ గార్డ్, ఎయిర్ ఫోర్స్, ఎస్.ఎ.సీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఆర్బీఐ, పోస్టల్ లో ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాన్ని బట్టి వేతనంలో స్వల్పంగా మార్పులు ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.