రూ.4,990కే కొత్త వాషింగ్ మెషీన్.. ఎలా కొనుగోలు చేయాలంటే..?

దేశంలో చాలామంది బట్టలు ఉతకటానికి వాషింగ్ మెషీన్ ను వినియోగిస్తున్నారు. అయితే వాషింగ్ మెషీన్ ఖరీదు చాలా ఎక్కువనే సంగతి తెలిసిందే. తక్కువ ధరలో వాషింగ్ మెషీన్ ను కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు ఆన్ లైన్ లో అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. కేవలం 4,990 రూపాయలకే కొత్త వాషింగ్ మెషీన్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని ప్రముఖ ఈకామర్స్ కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కల్పిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో వాషింగ్ మెషీన్ ను కొనుగోలు […]

Written By: Kusuma Aggunna, Updated On : July 20, 2021 4:18 pm
Follow us on

దేశంలో చాలామంది బట్టలు ఉతకటానికి వాషింగ్ మెషీన్ ను వినియోగిస్తున్నారు. అయితే వాషింగ్ మెషీన్ ఖరీదు చాలా ఎక్కువనే సంగతి తెలిసిందే. తక్కువ ధరలో వాషింగ్ మెషీన్ ను కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు ఆన్ లైన్ లో అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. కేవలం 4,990 రూపాయలకే కొత్త వాషింగ్ మెషీన్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని ప్రముఖ ఈకామర్స్ కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కల్పిస్తున్నాయి.

తక్కువ ఖర్చుతో వాషింగ్ మెషీన్ ను కొనుగోలు చేయాలని భావించే వాళ్లు వెంటనే వాషింగ్ మెషీన్ ను కొనుగోలు చేస్తే మంచిదని చెప్పవచ్చు. ఒనిడా 6.5 కేజీ వాషర్ ఓన్లీ వాషింగ్ మెషీన్ ధర 4,990 రూపాయలు కాగా ఇందులో రెండు రకాల వాష్ ప్రోగ్రామ్స్ ఉంటాయని తెలుస్తోంది. రెడ్ కలర్ లో ఈ వాషింగ్ మెషీన్ అందుబాటులో ఉండగా 740rpm ఈ వాషింగ్ మెషీన్ యొక్క మ్యాగ్జిమమ్ స్పీడ్ గా ఉంది.

తక్కువ సంఖ్యలో కుటుంబ సభ్యులు ఉన్నవాళ్లకు ఈ వాషింగ్ మెషీన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ వాషింగ్ మెషీన్ కు 1 ఇయర్ వారంటీ ఉండగా మోటార్ కు అదనపు వారంటీ ఉంటుందని తెలుస్తోంది. డీఎంఆర్ 6.5 కేజీ వాషర్ ఓన్లీ వాషింగ్ మెషీన్ కూడా ఆన్ లైన్ లో దాదాపు ఇదే ధరకు అందుబాటులో ఉండటం గమనార్హం. ముగ్గురు నుంచి నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నవాళ్లకు ఈ వాషింగ్ మెషీన్ ప్రయోజనకరంగా ఉంటుంది.

ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయగల సామర్థ్యం ఉన్నవాళ్లకు ఇతర కంపెనీలకు చెందిన వాషింగ్ మెషీన్లను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇంటెక్స్, థామ్సన్, క్యాండీ, మార్క్‌క్యూ కంపెనీలు కూడా తక్కువ ధరకే వాషింగ్ మెషీన్లను మార్కెట్ లోకి అందుబాటులోకి తెస్తున్నాయి.