DDA Recruitment 2022: ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. లాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్, జూనియర్ లాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు. ఆర్కిటెక్చర్ విభాగంలో ఐదేళ్ల బ్యాచిలర్ డిగ్రీ లేదా లాండ్ స్కేప్ ఆర్కిటెక్చర్‌లో మాస్టర్స్ డిగ్రీ చదివిన వాళ్లు ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
పని అనుభవం, ఇంటర్వ్యూతో పాటు అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. consultant.rc@dda.org.in మెయిల్ కు దరఖాస్తులను పంపడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రూ. 45,000 నుంచి రూ. 65,000 వరకు వేతనం లభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: బీపీసీఎల్ లో భారీ స్థాయిలో ఉద్యోగ ఖాళీలు.. రూ.1,20,000 వేతనంతో?
https://dda.org.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం 5 ఉద్యోగ ఖాళీలు ఉండగా సీనియర్ లాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్ (2), జూనియర్ లాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్ (3) ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం. నిరుద్యోగులకు సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
భారీ వేతనం లభిస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగానే ఉండనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా అర్హత ఉన్న నిరుద్యోగులకు మేలు జరుగుతుండగా నిరుద్యోగ అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.
Also Read: రైల్వేలో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. ఐటీఐ అర్హతతో?