సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 2439 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వారిని సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, బీఎస్ఎఫ్, ఏఆర్ లో నియమించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుండగా నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
2021 సంవత్సరం సెప్టెంబర్ నెల 13వ తేదీ నుంచి 2021 సంవత్సరం సెప్టెంబర్ నెల 15వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. రిటైర్డ్ సీఏపీఎఫ్ తో పాటు సాయుధ దళాల్లో పని చేసిన మాజీ ఉద్యోగులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://crpf.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయి.
మొత్తం 2439 ఖాళీలు ఉండగా ఆర్డ్మ్ రిజర్వ్డ్ (ఏఆర్) 156, బీఎస్ఎఫ్ 365, సీఆర్పీఎఫ్ 1537, ఐటీబీపీ 130, ఎస్ఎస్బీ 521 ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సీఏపీఎఫ్, ఏఆర్ వంటి సాయుధ దళాల్లో పనిచేసి రిటైర్డ్ అయిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. 62 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. డిగ్రీ మెమో, ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, రిటైర్మెంట్ సర్టిఫికేట్ తో ఫోటోలను కూడా అందజేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ టెస్ట్ ద్వారా ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.