https://oktelugu.com/

సీఐఎస్ఎఫ్ లో 690 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..?

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ దేశంలోని నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. సీఐఎస్ఎఫ్ నుంచి 690 ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. సీఐఎస్ఎఫ్ ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సబ్ కలెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అయితే ఈ ఉద్యోగాల సంఖ్య తుది ఎంపిక నాటికి స్వల్పంగా పెరిగే లేదా తగ్గే అవకాశాలు ఉన్నాయని సమాచారం. Also Read: పదో తరగతి విద్యార్థులకు 80 మార్కులకే పరీక్ష.. కానీ..? ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 6, 2021 / 07:59 PM IST
    Follow us on

    సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ దేశంలోని నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. సీఐఎస్ఎఫ్ నుంచి 690 ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. సీఐఎస్ఎఫ్ ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సబ్ కలెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అయితే ఈ ఉద్యోగాల సంఖ్య తుది ఎంపిక నాటికి స్వల్పంగా పెరిగే లేదా తగ్గే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

    Also Read: పదో తరగతి విద్యార్థులకు 80 మార్కులకే పరీక్ష.. కానీ..?

    ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలలో చేరడానికి అర్హతతో పాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు వచ్చే నెల 5వ తేదీ లోపు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.cisf.gov.in/ వెబ్ సైట్ ద్వారా 690 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 690 ఖాళీలలో అన్ రిజర్వ్‌డ్ ఉద్యోగాలు 536 కాగా ఎస్సీ అభ్యర్థులకు 103, ఎస్టీ అభ్యర్థులకు 51 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

    Also Read: డిప్లొమా పాసైన వాళ్లకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

    లిమిటెడ్ డిపార్ట్ మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం డిగ్రీ చదివి ఉండాలి. డిగ్రీ పాసై ఐదు సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 సంవత్సరం ఆగష్టు 1 నాటికి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ టెస్టులు, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.