కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసు: ఏ1 ఏవీ సుబ్బారెడ్డి అరెస్ట్.. కొనసాగుతున్న వేట

తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులనే కిడ్నాప్ చేసిన ఏపీకి చెందిన రాయలసీమ ఫ్యాక్షన్ నేతలను తెలంగాణ పోలీసులు వేటాడుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియను అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. ఏపీలోనూ ఈమెపై కబ్జాలు, హత్యాయత్నాలు, ఈమె భర్తపై దాడుల కేసులు నమోదైనా ఇప్పటిదాకా అరెస్ట్ ల వరకు వెళ్లలేదు. గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా చేసిన అఖిలప్రియపై వైసీపీ ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోలేదు. […]

Written By: NARESH, Updated On : January 6, 2021 8:10 pm
Follow us on

తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులనే కిడ్నాప్ చేసిన ఏపీకి చెందిన రాయలసీమ ఫ్యాక్షన్ నేతలను తెలంగాణ పోలీసులు వేటాడుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియను అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. ఏపీలోనూ ఈమెపై కబ్జాలు, హత్యాయత్నాలు, ఈమె భర్తపై దాడుల కేసులు నమోదైనా ఇప్పటిదాకా అరెస్ట్ ల వరకు వెళ్లలేదు. గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా చేసిన అఖిలప్రియపై వైసీపీ ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోలేదు.

Also Read: కొడాలి నాని కౌంటర్ కు నందమూరి బాలక్రిష్ణ ఎన్ కౌంటర్

అయితే తాజాగా హైదరాబాద్ లోని హఫీజ్ పేట భూవ్యవహారంలో మాత్రం భూమా అఖిలప్రియ బుక్ అయిపోయింది. ఏకంగా కేసీఆర్ బంధువులనే కిడ్నాప్ చేయించి అడ్డంగా బుక్ అయ్యింది. ఈమెను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ కేసులో ఏ1గా ప్రధాన నిందితుడిగా ఉన్న ఏపీలోని కర్నూలు నేత ఏవీ సుబ్బారెడ్డిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

నిజానికి కర్నూలు జిల్లాలో మాజీ మంత్రి అఖిలప్రియకు, ఆమె ప్రత్యర్థి ఏవీ సుబ్బారెడ్డికి అస్సలు పడదు. ఇద్దరూ దాడులు , ప్రతిదాడులతో కర్నూలులో హోరాహోరీగా తలపడ్డారు. కేసులు పెట్టుకున్నారు.  కానీ కేసీఆర్ బంధువుల కిడ్నాప్ లో వీరిద్దరే ఏ1, ఏ2గా ప్రధాన కుట్రదారులుగా తెలంగాణ పోలీసులు తేల్చారు. కొన్నాళ్లుగా కొట్టుకుంటున్న వీరిద్దరూ కలిసే భూదందాలు చేస్తున్నారా? అన్న అనుమానాలు కలిగేలా ఇప్పుడు తెలంగాణ పోలీసులు కీలక విషయాలను రాబట్టినట్టు తెలిసింది.

Also Read: చంద్రబాబు, లోకేష్.. టీడీపీ మీడియా పరువు తీసిన కొడాలి నాని

తాజాగా ఈ కిడ్నాప్ కేసును చాలెంజింగ్ తీసుకున్న పోలీసులు విచారణలో అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చారు. ఈ కేసులో పోలీసులు ఏ1గా ఏవీ సుబ్బారెడ్డిని పేర్కొన్నారు. ఏ2గా భూమా అఖిలప్రియను, ఏ3గా భార్గవ్ రామ్ ను పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

తాజాగా ఏవీ సుబ్బారెడ్డిని సైతం తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనమైంది.. ఇందుకు సంబంధించిన వీడియోలు పలు మీడియా చానెల్స్ లో వెలువడ్డాయి. ఇక మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్