Singareni Jobs: సింగరేణి ఉద్యోగాల దరఖాస్తు తేదీల్లో మార్పు.. ఎప్పటి నుంచంటే..

సవరించిన షెడ్యూల్‌ ప్రకాలం 327 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు మే 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి జూన్‌ 4 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు సింగరేణి వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Written By: Raj Shekar, Updated On : May 3, 2024 4:20 pm

Singareni Jobs

Follow us on

Singareni Jobs: తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి. ఈ సంస్థలో 327 ఉద్యోగాల భర్తీకి మార్చిలో నోటిఫికేషన్‌ విడుదైలంది. ఏడు కేటగిరీల్లో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు మొదట ఏప్రిల్‌ 15 నుంచి మే 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు పేర్కొన్నారు. అయితే తర్వాత ఆ తేదీల్లో మార్పు చేశారు. వివిధ కారణాలతో ఈ ప్రక్రియను వాయిదా వేశారు.

సవరించిన షెడ్యూల్‌ ఇలా..
సవరించిన షెడ్యూల్‌ ప్రకాలం 327 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు మే 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి జూన్‌ 4 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు సింగరేణి వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

భర్తీ చేసే పోస్టులివే..
– ఎగ్జిక్యూటివ్‌ కేటగిరీలో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(ఈఅండ్‌ఎం) ఈ2 గ్రేడ్‌–42, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(సిస్టమ్స్‌) ఈ2 గ్రేడ్‌ 7.

– నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేటగిరీలో.. జూనియర్‌ మైనింగ్‌ ఇంజినీర్‌ టీఅండ్‌ ఎస్‌ గ్రేడ్‌ సీ – 100, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ( మెకానికల్‌) టీఅండ్‌ ఎస్‌ గ్రేడ్‌ సీ–9, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ(ఎలక్ట్రికల్‌) టీ అండ్‌ ఎస్‌ గ్రేడ్‌ సీ–24, ఫిట్టర్‌ ట్రైనీ కేటగిరీ –1–47, ఎలక్ట్రీషియన్‌ ట్రైనీ కేటగిరీ –1 –98 చొప్పున భర్తీ చేయనున్నారు.

– దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 ఏళ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదేళ్లపాటు వయోపరిమితి సడలింపు ఉంటుంది.