Challan Rules: చలాన్.. అనగానే మనకు గుర్తుకు వచ్చేది వాహనాలకు విధించే ఫైన్. డిజిట్ వ్యవస్థ రాకముందు.. పోలీసులు వాహనాలను ఆపి జరిమానా వసూలు చేసేవారు. తర్వాత ఈ చలాన్ విధానం అందుబాటులోకి వచ్చింది. హెల్మెట్ ధరించకపోయినా, ట్రిపుల్ రైడ్ చేసినా, రాంగ్‌రూట్‌లో వెళ్లినా.. ట్రాఫిక్ సిగ్నల్స్ బ్రేక్ చేసినా మనదగ్గర చలాన్ విధిస్తారు. అయితే వాహనం మురికిగా ఉన్నా జరిమానా కట్టాల్సిందేనని ఎప్పుడైనా విన్నారా? ఈ వింత నిబంధన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ నగరంలో అమలు చేస్తున్నారు. ఎవరైనా మురికి కారును పబ్లిక్ పార్కింగ్‌లో లేదా రోడ్డు పక్కన పార్క్ చేస్తే వారు 500 దిర్హామ్‌లు అంటే భారత కరెన్సీలో సుమారు 11 వేల రూపాయల జరిమానా చెల్లించాలి.
2019 నుంచి అమలు..
దుబాయ్ చాలా బిజీగా ఉన్న నగరం. ఇక్కడి ప్రజలకు ప్రతిరోజూ కార్లు శుభ్రంగా కడగడానికి సమయం ఉండదు. ఈ క్రమంలో కాలుష్యం నియంత్రణకు దుబాయ్ ప్రభుత్వం 2019 నుంచి కొత్త నిబంధన అమలులోకి తెచ్చింది. పబ్లిక్ స్థలాల్లో దుమ్ముతో కారు నిలిపితే జరిమానా విధిస్తున్నారు. ఈ పరిస్థితిలో నీరు లేకుండా వాషింగ్ చేసే ట్రెండ్ పెరిగింది. దుబాయ్‌కి చెందిన ‘అల్ నజ్మ్ అల్ సతీ’ అనే కార్ వాష్ స్టార్టప్ 10–15 నిమిషాల్లో కారును కడుగుతుంది. ఇది కేవలం రూ. 230–340తో కారును శుభ్రం చేస్తుంది.
ఈ స్కూటర్‌లతో క్లీనింగ్..
ఇక కార్‌వాష్ పర్యావరణ అనుకూలమైన నీటిని ఉపయోగించదు. క్లీనింగ్ కోసం స్టార్టప్ ఈ స్కూటర్‌లను ఉపయోగిస్తుంది. వీటిలో డిటర్జెంట్, నీరు, బ్రష్‌లు ఉంటాయి. ఇది స్ప్రే బాటిల్‌ను కలిగి ఉంటుంది. ఇందులో వాటరింగ్ సొల్యూషన్ ఉంటుంది.