https://oktelugu.com/

Neethone Dance 2.0: తప్పంతా జడ్జిలదే.. నీతోనే డాన్స్ షో ఫుల్ సర్కస్ అయిపోయింది, అఖిల్ సార్థక్ సంచలన కామెంట్స్!

పలు టీవీ షోల్లో అఖిల్ సందడి చేశాడు. ఈటీవీలో ప్రసారమైన ఢీషో లో అఖిల్ మెంటర్ గా వ్యవహరించాడు. హైపర్ ఆదితో కలిసి కామెడీ చేస్తూ నవ్వులు పూయించారు.

Written By:
  • S Reddy
  • , Updated On : May 3, 2024 / 04:05 PM IST

    Akhil Sarthak sensational comments on Neethone Dance 2.0 Show

    Follow us on

    Neethone Dance 2.0: బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ తాజాగా నీతోనే డాన్స్ షో పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా జడ్జిలను నిందిస్తూ అఖిల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అఖిల్ సార్ధక్ బిగ్ బాస్ సీజన్ 4 లో పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. తన ఆట తీరుతో ప్రేక్షకుల్ని మెప్పించాడు.ఫైనల్ కి చేరుకున్న అఖిల్ సార్థక్ రన్నర్ గా నిలిచాడు. అభిజీత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అనంతరం బిగ్ బాస్ ఓటిటీ లో కూడా అఖిల్ పాల్గొన్నాడు. బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో కూడా ఫైనల్ కి వెళ్లి రన్నర్ పొజిషన్ తో సరిపెట్టుకున్నాడు.

    ఆ తర్వాత పలు టీవీ షోల్లో అఖిల్ సందడి చేశాడు. ఈటీవీలో ప్రసారమైన ఢీషో లో అఖిల్ మెంటర్ గా వ్యవహరించాడు. హైపర్ ఆదితో కలిసి కామెడీ చేస్తూ నవ్వులు పూయించారు. ఈ మధ్య అఖిల్ పెద్దగా బుల్లితెర పై కనిపించడం లేదు. అటు సోషల్ మీడియాలో కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. అనూహ్యంగా స్టార్ మాలో ప్రసారం అవుతున్న నీతోనే డాన్స్ 2.0 పై అసహనం వ్యక్తం చేశాడు. అఖిల్ సార్థక్ తన అసంతృప్తి వెళ్లగక్కాడు.

    ఇప్పుడే ఓ ప్రోమో చూశాను .. చాలా దారుణంగా ఉంది. డాన్స్ చేస్తే మార్కులు ఇవ్వరు. స్టంట్స్ చేస్తే చాలంట. జడ్జిలు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా లేరు. ఇలా అంటున్నందుకు క్షమించండి. స్టార్ మా ఈసారి పరువు తీసుకుంటుంది. నీతోనే డాన్స్ షో సర్కస్ గా మారిపోయింది. కంటెస్టెంట్ల తప్పేమి లేదు .. వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న జడ్జీలదే తప్పంతా. డాన్స్ షో అనేది డాన్స్ షోలా ఉంటే బాగుంటుంది. ఈసారి జడ్జిలు ఏమి బాగాలేరు .. ఇది నా అభిప్రాయం అంటూ అఖిల్ సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు.

    అఖిల్ సార్థక్ పోస్ట్ సంచలనంగా మారింది. గతంలో అఖిల్ నీతోనే డాన్స్ సీజన్ 1 లో పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. తేజస్వినితో కలిసి అఖిల్ డాన్స్ చేసాడు. మొదటి సీజన్ లో ఈ జోడి గట్టిగా పెర్ఫార్మ్ చేశారు. కాగా అఖిల్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయానికి గురయ్యాడు. దీంతో ఈ జంట అర్థాంతరంగా నీతోనే డాన్స్ షో నుండి తప్పుకోవాల్సి వచ్చింది.