CBSE Scholarship: విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా స్కారల్‌షిప్ అందిస్తుంటాయి. వీటితోపాటు కార్పొరేట్ సంస్థలు కూడా ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్‌షిప్ ఇస్తున్నాయి. టాటా ఇనిస్టిట్యూట్, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్, విప్రో లాంటి సంస్థలు కూడా ఏటా పేద విద్యార్థులకు ఆర్థికసాయం అందించి ప్రోత్సహిస్తున్నాయి. ఇక కేంద్రం ప్రభుత్వం ప్రతిభ ఉన్న విద్యార్థులతోపాటు పేద, వెనుకబడిన కులాలు, దివ్యాంగులకు కూడా స్కాలర్‌షిప్ అందిస్తోంది. తల్లిదండ్రులకు ఏకైక సంతానం ఉండి ప్రతిభావంతులైన పిల్లలను ప్రోత్సహించడానికి సీబీఎస్‌ఈ స్కాలర్‌షిప్ అందిస్తోంది. ఈ ఏడాది సింగిల్ చైల్డ్ స్కాలర్‌షిప్ దరఖాస్తుకు అక్టోబర్ 31 వరకు అవకాశం ఉంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్..
పదో తరగతి పూర్తి చేసిన అమ్మాయి.. తల్లిదండ్రులకు ఒక్కతే సంతానం అయితే ఈ స్కారల్‌షిప్‌కు అర్హులు. తల్లిదండులకే ఏకైక సంతానంగా ఉండి.. ప్రతిభావంతులైన ఆడ పిల్లలను ప్రోత్సహించేందుకు ఈ స్కాలర్‌షిప్ రూపొందించింది. 2024 విద్యా సంవత్సరానికి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అర్హతలు ఇవీ..
– తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లలను విద్యలో ప్రోత్సహించడమే ఈ స్కాలర్‌షిప్ ఉద్దేశం.
– స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.500 చొపుపన రెండేళ్లపాటు అందిస్తారు.
– విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్‌తో పదో తరగతి పాస్ అయి ఉండాలి. ప్రస్తుతం సీబీఎస్‌ఈ పాఠశాలల్లో 11, 12వ తరగతి అభ్యసిస్తుండాలి.
– విద్యార్థినులు పదో తరగతిలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. విద్యార్థినులు ట్యూషన్ ఫీజు నెలకు రూ.1,500లకు మించరాదు.
– ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియకు అక్టోబర్ 31 వరకు గడువు ఉంది. దరఖాస్తులను ఆయా పాఠశాలలు నవంబర్ 7వ తేదీ వరకు వెరిఫికేషన్ చేస్తాయి.
– స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థులు 11వ తరగతి తర్వాత మళ్లీ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం 11వ తరగతిలో విద్యార్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. రెన్యూవల్ కోసం కూడా అక్టోబర్ 31వ తేదీ వరకు గడువు ఉంది.