CBSE 499 marks out of 500 topper story: స్టేట్ సిలబస్ తో పోల్చి చూస్తే.. సెంట్రల్ సిలబస్ కాస్త కఠినంగా ఉంటుంది. అందువల్ల cbse లో విద్యార్థులు అంచనా వేసినట్టుగా మార్కులు రావు. అయితే కొందరికి మాత్రం మార్కులు ప్రవాహం మాదిరిగా వస్తూ ఉంటాయి. సరస్వతి కటాక్షం ఉండడంతో వారికి సెంట్రల్ సిలబస్ కేక్ వాక్ లాగా ఉంటుంది. మార్కులు సాధించడం వారికి పెద్ద కష్టం కాదు. అయితే ఈ జాబితాలో కొంతమంది మాత్రం ఒక్క మార్కు తక్కువ వచ్చినా సరే తట్టుకోలేరు. చివరికి ఆ ఒక్క మార్కు సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తారు. ఎంత కష్టమైనా సరే భరిస్తారు.
ఇటీవల సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో చాలామంది విద్యార్థులు టాప్ మార్కులు సాధించారు. వారిలో కేరళ రాష్ట్రానికి చెందిన ఆశిమా కూడా ఉంది. కాకపోతే ఈమె ఏకంగా 500 మార్కులకు 499 మార్కులు సాధించింది. వాస్తవానికి సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలలో 90 శాతం మార్పులు వస్తేనే చాలామంది గొప్పగా భావిస్తుంటారు. కానీ ఆ సినిమా ఏకంగా 99.9 పర్సంటేజ్ సాధించింది. అయినప్పటికీ ఆమెకు సంతృప్తి లేదు. 0.1 శాతం కూడా మిస్ కావొద్దు అనేది ఆమె ఆలోచన. అందువల్లే వెంటనే రివాల్యుయేషన్ కు సిద్ధమైపోయింది.
ఆషిమాకు అన్నిట్లోనూ వందకు వంద మార్కులు వచ్చాయి. సైన్స్ లో మాత్రం 99 మార్కులు వచ్చాయి. ఆ ఒక్క మార్కు కూడా తెచ్చుకొని 500 కు 500 సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తోంది.. ఆషీమా చిన్నప్పటినుంచి చదువులో టాపర్. ఎప్పుడూ నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుకొనేది. అందువల్లే ఆమెను తోటి విద్యార్థులు చదువుల తల్లి అని పిలిచేవారు. సీబీఎస్ఈ ఫలితాలలో కూడా తన స్నేహితులతో తనకు నూటికి నూరు శాతం మార్పులు వస్తాయని ధీమా వ్యక్తం చేసింది..
ఆయా సబ్జెక్టులలో తాను ప్రిపేర్ అయిన ప్రశ్నలే వచ్చాయి. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే సైన్స్ లో మాత్రం ఒక్క మార్కు తగ్గడంతో ఆమె తీవ్ర నిరాశలో మునిగిపోయింది. అందువల్లే ఆ ఒక్క మాట కూడా సాధించడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. రివాల్యుయేషన్ కు దరఖాస్తు కూడా చేసింది. తనకు పూర్తిస్థాయిలో నమ్మకం ఉందని.. ఖచ్చితంగా వందకు వంద మార్కులు తెచ్చుకుంటానని ఆమె గట్టి నమ్మకంతో ఉంది. “నాకు ఆ ఒక్క మార్కు కూడా కావాలి. నేను పరీక్ష అద్భుతంగా రాశాను. ఎక్కడ మిస్ అయిందో తెలియడం లేదని” అషీమా పేర్కొంది.