https://oktelugu.com/

యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పిన సిగ్నల్ యాప్..?

దేశంలో లక్షల సంఖ్యలో యూజర్లు వాట్సాప్ యాప్ కు ప్రత్యామ్నాయంగా సిగ్నల్ యాప్ ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. కొందరు రెండు యాప్ లను వినియోగిస్తుంటే మరి కొందరు మాత్రం వాట్సాప్ ను అన్ ఇన్ స్టాల్ చేసి సిగ్నల్ యాప్ ను వినియోగిస్తున్నారు. తాజాగా సిగ్నల్ యాప్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. యూజర్ల కొరకు ఈ యాప్ ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. Also Read: జీమెయిల్ అకౌంట్ వాడుతున్నారా.. పాటించాల్సిన జాగ్రత్తలివే..? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 24, 2021 / 01:59 PM IST
    Follow us on

    దేశంలో లక్షల సంఖ్యలో యూజర్లు వాట్సాప్ యాప్ కు ప్రత్యామ్నాయంగా సిగ్నల్ యాప్ ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. కొందరు రెండు యాప్ లను వినియోగిస్తుంటే మరి కొందరు మాత్రం వాట్సాప్ ను అన్ ఇన్ స్టాల్ చేసి సిగ్నల్ యాప్ ను వినియోగిస్తున్నారు. తాజాగా సిగ్నల్ యాప్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. యూజర్ల కొరకు ఈ యాప్ ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.

    Also Read: జీమెయిల్ అకౌంట్ వాడుతున్నారా.. పాటించాల్సిన జాగ్రత్తలివే..?

    వాట్సాప్ యూజర్ల కోసం తెచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు కొందరు వాట్సాప్ యూజర్లు సిగ్నల్ యాప్ ను వినియోగించడానికి కారణమయ్యాయి. సిగ్నల్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బ్రియాన్ ఆక్టన్ మాట్లాడుతూ వాట్సాప్ తరహా కొత్త ఫీచర్లను సిగ్నల్ యాప్ యూజర్ల కొరకు అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. సిగ్నల్ యాప్ యూజర్ల భద్రతకు తమ కంపెనీ కట్టుబడి ఉందని తెలిపారు.

    Also Read: మొబైల్ లోనే ఓటర్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. ఎలా అంటే?

    వాట్సాప్ యాప్ నుంచి కొంతమంది టెలీగ్రామ్ యాప్ కు మరి కొంతమంది సిగ్నల్ యాప్ కు మైగ్రేట్ అవుతున్న నేపథ్యంలో యూజర్ల సంఖ్యను పెంచుకోవడానికి సిగ్నల్ యాప్ ప్రయత్నాలు చేస్తోంది. వాట్సాప్ ను పోలిన ఫీచర్లను సిగ్నల్ యాప్ అందుబాటులోకి తెస్తూ ఉండటం గమనార్హం. సిగ్నల్ యాప్ చాట్ వాల్‌ పేపర్, స్టేటస్‌ అప్‌డేట్, యానిమేటెడ్ స్టిక్కర్లు, గ్రూప్ కాల్స్, గ్రూప్ ఇన్‌వైట్‌ లింక్ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    సిగ్నల్ తెచ్చిన చాట్ వాల్‌ పేపర్ ఆప్షన్ ద్వారా చాట్ వాల్ పేపర్ ను సులువుగా మార్చుకోవచ్చు. స్టేటస్‌ అప్‌ డేట్ ఫీచర్ ద్వారా స్టేటస్ ను సులభంగా అప్ డేట్ చేసుకోవచ్చు. యానిమేటెడ్ స్టిక్కర్లు ఆప్షన్ ద్వారా ఫ్రెండ్స్ తో యానిమేటెడ్ స్టిక్కర్లను పంచుకోవచ్చు. గ్రూప్ కాల్ ఫీచర్ ద్వారా ఎనిమిది మంది గ్రూప్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. గ్రూప్ ఇన్‌వైట్‌ లింక్ ద్వారా సిగ్నల్ యూజర్లను గ్రూపులలోకి ఆహ్వానించడానికి అవకాశం ఉంటుంది.