
దేశంలో నిరుద్యోగుల శాతం సంవత్సరం సంవత్సరానికి పెరుగుతోంది. గ్రాడ్యుయేషన్ పూర్తైన విద్యార్థులలో చాలామంది సరైన అవగాహన లేకపోవడం వల్ల కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతుండగా తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థ ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
బీపీసీఎల్ రిలీజ్ చేసిన ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా 168 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. మొత్తం ఉద్యోగ ఖాళీలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలు 120 కాగా టెక్నీషియన్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 48 ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు అర్హత, అనుభవానికి తగిన వేతనం లభిస్తుంది. 2021 సంవత్సరం ఆగష్టు 1 నాటికి 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మెటలర్జికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఇంజనీరింగ్ చదివిన వాళ్లు, డిప్లొమా చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్, డిప్లొమా పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
https://www.bharatpetroleum.in/ వెబ్ సైట్ ద్వారా ఈ నెల 25వ తేదీలోపు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.