హెల్త్ ఇన్సూరెన్స్‌లో చౌక పాలసీ.. ఎక్కువ ప్రయోజనాలతో..?

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆరోగ్య భీమాను కలిగి ఉండటం వల్ల ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. మారుతున్న జీవనశైలి వల్ల వస్తున్న జబ్బులతో పాటు సీజనల్ వ్యాధుల వల్ల చాలామంది ఆస్పత్రులలో చేరాల్సి వస్తోంది. ఆరోగ్య భీమా పాలసీలను తీసుకుంటే ఇలాంటి పరిస్థితులను సులువుగా ఎదుర్కోవచ్చు. పాలసీ ఫీచర్లు, కవరేజ్ ఆప్షన్లపై రీసెర్చ్​ చేసి హెల్త్ […]

Written By: Navya, Updated On : July 19, 2021 9:26 pm
Follow us on

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆరోగ్య భీమాను కలిగి ఉండటం వల్ల ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. మారుతున్న జీవనశైలి వల్ల వస్తున్న జబ్బులతో పాటు సీజనల్ వ్యాధుల వల్ల చాలామంది ఆస్పత్రులలో చేరాల్సి వస్తోంది. ఆరోగ్య భీమా పాలసీలను తీసుకుంటే ఇలాంటి పరిస్థితులను సులువుగా ఎదుర్కోవచ్చు.

పాలసీ ఫీచర్లు, కవరేజ్ ఆప్షన్లపై రీసెర్చ్​ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునే వాళ్లు పాలసీని ఎంచుకుంటే మంచిది. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ ను తీసుకోవచ్చు. ప్రతి కుటుంబానికి కనీసం 5 లక్షల రూపాయల ఫ్లోటర్ ఆరోగ్య బీమా పాలసీ ఉంటే మంచిదని ఆరోగ్య భీమా నిపుణులు చెబుతున్నారు. చౌక రేట్లతో హెల్త్ ఇన్సూరెన్స్ ను అందించే కంపెనీలు చాలానే ఉన్నాయి.

యునైటెడ్ ఇండియా 5,581 రూపాయలు, న్యూ ఇండియా 5,791 రూపాయలు, ఎస్బీఐ జనరల్ 6,088 రూపాయలు, టాటా ఏఐజీ 6,347 రూపాయలు, ఆదిత్య బిర్లా 6,371 రూపాయలు, యూనివర్సల్ సోంపో 6,393 రూపాయలు, జాతీయ బీమా 6,486 రూపాయలు, మాక్స్ బుపా 6,542 రూపాయలు, రాయల్ సుందరం 6,560 రూపాయలు 5 లక్షల రూపాయల ఫ్లోటర్ ఇన్సూరెన్స్ పాలసీకి ప్రీమియంగా ఉన్నాయి.

వ్యాధులు, కవర్ పరిమాణం, లక్షణాలు లేదా ఇతర నిబంధనలు, షరతులను బట్టి ప్రీమియం మొత్తంలో మార్పులు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఆరోగ్య బీమాకు నగదు రహిత సౌకర్యం కూడా ఉండటంతో పాలసీ తీసుకున్న వాళ్లకు ప్రయోజనం చేకూరుతుంది.