https://oktelugu.com/

Rajamouli Speciality: రాజమౌళి సినిమాల్లో కామన్ గా కనిపించే ఈ పాయింట్స్ ఎప్పుడైనా గమనించారా ?

Rajamouli Speciality:  తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాజమౌళి సినిమా అంటే ఇష్టముండని వారుండగారు. ఆయన తీసిన ప్రతీ సినిమాలో ఏదో కొంత విషయం ఉండడంతో పాటు అన్ని హంగులు కనిపిస్తాయి. రాజమౌళి సినిమాలో స్టార్ హీరో నటించినా.. హీరో కంటే ఎక్కువగా ఈ దిగ్గజ దర్శకుడికే పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఇక ‘బాహుబలి’ సినిమాల తరువాత రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. విదేశాల్లోనూ రాజమౌళికి ప్రత్యేకంగా అభిమానులు ఉండడం విశేషం. అంతటి రాజమౌళి […]

Written By:
  • NARESH
  • , Updated On : January 26, 2022 / 10:00 AM IST
    Follow us on

    Rajamouli Speciality:  తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాజమౌళి సినిమా అంటే ఇష్టముండని వారుండగారు. ఆయన తీసిన ప్రతీ సినిమాలో ఏదో కొంత విషయం ఉండడంతో పాటు అన్ని హంగులు కనిపిస్తాయి. రాజమౌళి సినిమాలో స్టార్ హీరో నటించినా.. హీరో కంటే ఎక్కువగా ఈ దిగ్గజ దర్శకుడికే పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఇక ‘బాహుబలి’ సినిమాల తరువాత రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. విదేశాల్లోనూ రాజమౌళికి ప్రత్యేకంగా అభిమానులు ఉండడం విశేషం. అంతటి రాజమౌళి సినిమాలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రత్యేకతలేంటో ఒకసారి చూద్దాం..

    Rajamouli Speciality

    స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి తీసిన సినిమాల్లో ఇప్పటి వరకు దాదాపు అన్నీ విజయం సాధించినవే. అయితే కాస్త యావరేజ్ ఉన్న సినిమాల్లోనూ ఈ జక్కన్న మంచి మెసేజ్ చూపించారు. ఒక సినిమాకు మరో సినిమాతో సంబంధం లేకుండా ఆయన తీసే సినిమాలు.. ప్రతీదీ ప్రత్యేకత సంతరించుకున్నారు. అంతేకాకుండా ప్రతీ సినిమా హై రేంజ్ లో ఉండేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటారు జక్కన్న.

    Also Read: అలెర్ట్ : ఐఫోన్‌ అభిమానులకు శుభవార్త !

    ఇక రాజమౌళి సినిమాల్లో ఓ విషయం మనం గమనించవచ్చు. ఆయన తీసే ప్రతీ సినిమాలో ఒక ఆయుధం కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన ‘సింహాద్రి’ సినిమాలో జక్కన్న తీసుకొచ్చిన ఆయుధం ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత వచ్చిన ఛత్రపతి, విక్రమార్కుడు సినిమాల్లోనూ ప్రత్యేకత సంతరించుకున్న ఆయుధాలు కనిపిస్తాయి. ఇక మగధీరలో వంద మందిని చంపే ఆయుధాలు, బాహుబలిలో ఖడ్గాలు ఆకర్షిస్తాయి. ఇక రాజమౌళి మైండ్ నుంచి వస్తున్న మరో సినిమా ‘ట్రిపుల్ ఆర్’. ఈ సినిమాలోనూ స్పెషల్ ఆయుధాలు ఉన్నాయని అంటున్నారు.

    రాజమౌళి సినిమాల్లో ఆయుధాలతో పాటు లాకెట్స్ కూడా మనం చూడొచ్చు. సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ మెడలో ఉన్న లాకెట్ ను ఎవరూ గుర్తించకపోవచ్చు. ఈ సినిమాలో తారక్ మెడలో పులిగోరు ఉంటుంది. ఆ తరువాత ఛత్రపతి సినిమాలో ప్రభాస్ మెడలో శంఖం కనిపిస్తుంది. యమదొంగ సినిమాలో ప్రత్యేక లాకెట్ ఉంటుంది. బాహుబలిలో ప్రభాస్ మెడలో శివలింగం ఉంటే.. ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ మెడలో ఓంకారం లాకెట్ ఉంటుందట. ఇలా కొన్ని వస్తువులను రాజమౌలి కచ్చితంగా వాడుతారు.

    Rajamouli Speciality

    జక్కన తీసే సినిమాలో మరో ప్రత్యేకత ఏంటంటే.. హీరోలకు ప్లాష్ బ్యాక్ ఉండడం. ప్లాష్ బ్యాక్లో గొప్ప పని సాధించి ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్నట్లు చూపిస్తాడు. అయితే ఇది రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథల ప్రభావం అనుకోవచ్చు. రాజమౌళి సినిమాల్లో స్త్రీలను ప్రత్యేకంగా చూపిస్తాడు. ముఖ్యంగా వారికి బొట్టును తీర్చిదిద్దడంలో శ్రద్ధ వహిస్తారు. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ నుదుట నిండు చందమామల పెద్ద బొట్టుతో కనిపిస్తుంది. ఇలా జక్కన తన సినిమాల్లో ప్రతిదీ ప్రత్యేకతగా తీసుకొని తీర్చి దిద్దుతారు.

    Also Read: హైదరాబాద్‌కు వ‌స్తున్న మరో టాప్ కంపెనీ.. రూ.20 వేల కోట్ల పెట్టుబ‌డులు!

    Tags