https://oktelugu.com/

Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో భారీగా జాబ్స్.. డిప్లొమా, ఐటీఐ అర్హతతో?

Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తాజాగా 91 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగ ఖాళీలలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగ ఖాళీలు 66 ఉండగా టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలు 25 ఉన్నాయి. 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఇంజనీరింగ్ డిప్లొమాలో పాసైన వాళ్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 23, 2022 / 01:19 PM IST
    Follow us on

    Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తాజాగా 91 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగ ఖాళీలలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగ ఖాళీలు 66 ఉండగా టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలు 25 ఉన్నాయి. 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఇంజనీరింగ్ డిప్లొమాలో పాసైన వాళ్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 24,500 రూపాయాల నుంచి 90,000 రూపాయల వరకు వేతనం లభించే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం అందుతోంది. టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు సంవత్సరం పాటు అప్రెంటీష్ ట్రైనీ పూర్తి చేయాలి. ఐటీఐతో పాటు ఎస్.ఎస్.ఎల్.టీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు నెలకు 21,500 రూపాయల నుంచి 82,000 రూపాయల వరకు వేతనం పొందే అవకాశం అయితే ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికయ్యే ఛాన్స్ ఉంటుంది. 2022 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉందని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    bel-india.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.