KGF Mother: కన్నడ రాక్ స్టార్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన కేజీఎఫ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెల్సిందే. ఈ మూవీకి సిక్వెల్ గా వచ్చిన ‘కేజీఎఫ్ చాప్టర్-2’ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీసులను షేక్ చేస్తోంది. దర్శకుడు ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’తో పోటీపడి మరీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
కేజీఎఫ్ మూవీలో యశ్(రాఖీభాయ్) పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో అతడి తల్లి పాత్రకే అంతే ప్రాధాన్యం ఉంది. కేజీఎఫ్ కథ మొత్తాన్ని నడిపించిది తల్లి సెంటిమెంటే. ఈ పాత్రలో అర్చన జోయిస్ అనే యువతి నటించింది. అసలు ఆమెకు ఈ పాత్ర ఎలా దక్కింది? తన ఫ్యామిలీ సంగతులు, తెలుగు హీరోలపై తన అభిప్రాయం ఏంటన్న విషయాలను అర్చన తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
కేజీఎఫ్ సినిమాలో కంటే ముందు అర్చన జోయిస్ బుల్లితెరపై నటించింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ మూవీలో యశ్ తల్లి పాత్ర కోసం వెతుకుతుండగా ‘మహాదేవి’ సీరియల్ చూశారట. ఇందులో అర్చన నటన నచ్చడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ తన సినిమా కోసం సంప్రదించారట. దీనికి అర్చన వెంటనే ఒకే చెప్పడంతో కేజీఎఫ్ లో యశ్ తల్లి పాత్ర లభించినట్లు అర్చన తెలిపింది.
అర్చన ఫ్యామిలీ విషయానికొస్తే.. ఆమె తల్లిదండ్రులు శ్రీనివాసన్, వీణ. వీరిద్దరు కూడా ఉపాధ్యాయులే కావడం విశేషం. అర్చనకు ఒక చెల్లెలు కూడా ఉంది. అర్చన ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ చేసింది. డాన్స్ పై ఇష్టంతో కథక్ నేర్చుకుంది. అయితే డాన్సర్ కాకుండా నటిగానే ఆమె బుల్లితెరపై అవకాశం దక్కించుకోవడం విశేషం.
‘స్టార్ సువర్ణ’ అనే ఛానల్ లో ప్రసారమైన ‘దుర్గా’ అనే సీరియల్ లో అర్చన తొలిసారి కన్పించారు. ఆమె నటనను గుర్తించిన శృతినాయుడు ‘మహాదేవి’ సీరియల్లో అవకాశం కల్పించాడు. ఈ సీరియల్ జీ కన్నడలో ప్రసారమైంది. ఈ సీరియల్ వల్లే ఆమెకు కేజీఎఫ్ లాంటి ప్యాన్ ఇండియా మూవీలో ఛాన్స్ దక్కింది.
కేజీఎఫ్ సినిమా కోలార్ మైన్స్ చుట్టూనే తిరుగుతుంది. అర్చనకు కూడా కోలార్ ప్రాంతంలో సంబంధం ఉంది. తాను పుట్టింది కోలార్ లోనేనని అర్చన చెప్పుకొచ్చింది. అలాగే తెలుగులో ప్రభాస్, రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నానిల సినిమాలు చూస్తానని అన్నారు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చూశానని.. రాంచరణ్ యాక్టింగ్ తనను కట్టిపడేసిందన్నారు. ఎన్టీఆర్ క్యూట్ గా ఉంటాడని తెలిపింది. కేజీఎఫ్ హిట్టుతో అర్చన జోయిస్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు.
Recommended Videos: