Bank of Maharashtra Recruitment 2021: ప్రభుత్వ రంగ బ్యాంక్ లో 190 ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో..?

Bank of Maharashtra Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ లలో ఒకటైన బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర నిరుద్యోగులకు తీపికబురు అందించింది. స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ స్కేల్‌-1, 2 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 190 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా సెప్టెంబర్ 18 ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా […]

Written By: Kusuma Aggunna, Updated On : September 4, 2021 5:37 pm
Follow us on

Bank of Maharashtra Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ లలో ఒకటైన బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర నిరుద్యోగులకు తీపికబురు అందించింది. స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ స్కేల్‌-1, 2 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 190 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా సెప్టెంబర్ 18 ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

https://www.bankofmaharashtra.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 190 ఉద్యోగ ఖాళీలలో ప్రొడక్టర్‌ సపోర్ట్‌ ఇంజనీర్‌, నెట్‌వర్క్‌ అండ్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‌, ఈ-మెయిల్‌ అడ్మినిస్ట్రేటర్‌, ఐటీ సపోర్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌, డీబీఏ(ఎంఎస్ఎస్‌క్యూఎల్‌/ఒరాకిల్‌), విండోస్‌ అడ్మినిస్ట్రేటర్‌, అగ్రికల్చరల్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌, సెక్యూరిటీ ఆఫీసర్‌, లా ఆఫీసర్‌, ఇతర ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/బీటెక్‌/ఎంసీఏ/ఎమ్మెస్సీ, పీజీ పాసై ఉండటంతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 20 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఐబీపీఎస్ ద్వారా ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షకు నెగిటివ్ మార్కింగ్ లేదు. 2021 సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.