https://oktelugu.com/

Pawan Kalyan financial help : అరుదైన కళకు ప్రాణం పోసిన పవన్ కళ్యాణ్ !

Pawan Kalyan financial help: దర్శనం మొగులయ్య (Kinnera Mogilaiah) స్వరాలు సహజమైనవి. పైగా ఆయన ’12 మెట్ల కిన్నెర’ పై స్వరాలు పలికించే అరుదైన కళాకారుడు కూడా. అసలు ఈ 12 మెట్ల కిన్నెర అంటే ఏమిటి ? అని అడిగే పరిస్థితుల్లో ఉంది నేటి తరం. ’12 మెట్ల కిన్నెర’ అనేది ఒక సంగీత వాయిద్య పరికరం. ఈ పరికరంతో స్వరాలను పలికించే నైపుణ్యం ఉండటం గొప్ప విషయం. పైగా ’12 మెట్ల కిన్నెర’ […]

Written By: , Updated On : September 4, 2021 / 05:42 PM IST
Follow us on

Pawan Kalyan Kinnera MogilaiahPawan Kalyan financial help: దర్శనం మొగులయ్య (Kinnera Mogilaiah) స్వరాలు సహజమైనవి. పైగా ఆయన ’12 మెట్ల కిన్నెర’ పై స్వరాలు పలికించే అరుదైన కళాకారుడు కూడా. అసలు ఈ 12 మెట్ల కిన్నెర అంటే ఏమిటి ? అని అడిగే పరిస్థితుల్లో ఉంది నేటి తరం. ’12 మెట్ల కిన్నెర’ అనేది ఒక సంగీత వాయిద్య పరికరం. ఈ పరికరంతో స్వరాలను పలికించే నైపుణ్యం ఉండటం గొప్ప విషయం. పైగా ’12 మెట్ల కిన్నెర’ స్వరాలకు 400 ఏళ్ల చరిత్ర ఉందట.

అందుకే, ఈ కళ పట్ల పవన్ కి మొదటి నుంచి ప్రేమ ఉంది. కానీ ఈ ’12 మెట్ల కిన్నెర’ కళ అంతరించిపోవడానికి రెడీగా ఉంది. ఈ విద్య ఇప్పటికే కనుమరుగైపోయింది. దర్శనం మొగులయ్య లాంటి అతి కొద్దిమంది మాత్రమే ఈ విద్యను ప్రదర్శిస్తున్నారు. ఆ తరం కూడా త్వరలోనే దూరమయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు ఎవరికీ ఈ విద్య గురించి తెలియకుండా పోతుంది.

కానీ ‘భీమ్లా నాయక్’ సినిమా కోసం ’12 మెట్ల కిన్నెర’ స్వరాలకు జీవం పోశాడు మొగులయ్య. పవన్ బర్త్ డే స్పెషల్ గా వచ్చిన ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే, ఆ సాంగ్ లో అడవిలో కూర్చొని పాటే పాడే పెద్దాయన ఉన్నాడు కదా, ఆయనే దర్శనం మొగులయ్య. సాకీ ఆలపిస్తూ కిన్నెర మెట్లపై స్వరాన్ని పలికించిన ఆయన ప్రస్తుతం పేదరికంతో బాధ పడుతున్నారు.

చాలా కాలంగా పేదరికంలో మగ్గుతున్న ఆయనకు పవన్ నుంచి సాయం అందింది. తన సినిమాలో ఆయన చేత పాడించి, ఆయనకు మంచి రెమ్యునరేషన్ ను ఇప్పించడంతో పాటు తానే స్వయంగా రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. శ్రీ మొగులయ్య గారు కిన్నెర మీటుతూ పలు జానపద కథలను పాటల రూపంలో వినిపిస్తారు. ఆయనకు ‘పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్’ ద్వారా రూ.2 లక్షలు అందించాలని శ్రీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారు నిర్ణయించారు’ అంటూ జనసేన కార్యాలయం నుండి ఒక ప్రకటన వచ్చింది.

పవన్ చేసిన ఈ రెండు లక్షల క్యాష్ ను త్వరలోనే మొగులయ్య గారికి అందచేయబోతున్నారు. శ్రీ మొగులయ్య గారు తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేయడంలో ఈయన అరుదైన కళాకారుడు అని చెప్పొచ్చు. ఏది ఏమైనా అలాంటి కళాకారుడికి సాయం చేసి ఓ అరుదైన కళకు పవన్ ప్రాణం పోశాడు.