https://oktelugu.com/

Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో భారీ ప్యాకేజీతో ఉద్యోగ ఖాళీలు.. అర్హతలు ఇవే?

Jobs: భారత ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు, అనుభవం ఉన్న ఉద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పోస్టుల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. మొత్తం 79 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 7, 2022 / 02:24 PM IST
    Follow us on

    Jobs: భారత ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు, అనుభవం ఉన్న ఉద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పోస్టుల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. మొత్తం 79 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

    25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 15 లక్షల రూపాయల నుంచి 18 లక్షల రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. నాలుగేళ్ల డిగ్రీతోపాటు పీజీ/డిప్లొమాలో పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.

    ఏదైనా డిగ్రీతోపాటు పీజీ/డిప్లొమా (మేనేజ్‌మెంట్‌)/సీఏలో ఉత్తీర్ణత ఉన్నవాళ్లు అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో ఐదేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది.

    ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. 2022 సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. https://www.bankofbaroda.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.