Job Vacancies in Nellore: ఏపీ వైద్య విధాన పరిషత్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. మొత్తం 126 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది. వేర్వేరు ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఫిజియోథెరపిస్ట్, జనరల్ డ్యూటీ అటెండెంట్లు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలతో పాటు ల్యాబ్ అటెండెంట్లు, కౌన్సెలర్లు, డెంటల్ టెక్నీషియన్, బయోమెడికల్ ఇంజనీర్లు, పోస్టు మార్టం అసిస్టెంట్లు, రేడియోగ్రాఫర్, థియేటర్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
Also Read: అక్కడ కొవిడ్ రూల్స్ ఎత్తేసిన ఏపీ ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకున్న జగన్..!
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 15,000 రూపాయల నుంచి 52,000 రూపాయల వరకు వేతనంగా లభించనుందని సమాచారం అందుతోంది. ఏపీ పారా మెడికల్ బోర్డులో రిజిష్టర్ కావడంతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. పది, ఇంటర్, డిప్లొమా, బీఏ, బీటెక్, బీఎస్సీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ను బట్టి ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆఫ్‌లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. https://spsnellore.ap.gov.in/notice_category/recruitment/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది.
Also Read: వైఎస్ వివేకా హత్య: టీడీపీలో చేరేందుకు ఆయన కూతురు రెడీ అయ్యిందా?
Recommended Video: