
చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైయినింగ్ అకాడమీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 2021 అక్టోబర్ సంవత్సరానికి సంబంధించిన 57వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) మెన్, షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) ఉమెన్ కోర్సు కోసం నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు చేయాలని భావించే వాళ్లకు ఇది శుభవార్త అనే చెప్పాలి. బీటెక్ పాసైన పెళ్లి కాని యువతీయువకులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాలి.
ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 23 దరఖాస్తులకు చివరి తేదీగా ఉంది. http://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు తమిళనాడు రాజధాని చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం 191 ఉద్యోగ ఖాళీలలో సివిల్ ఉద్యోగ ఖాళీలు 60, కంప్యూటర్ సైన్స్ 31, మిగిలిన విభాగాల్లో ఇతర ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) ఉమెన్ కోర్స్ 14 ఖాళీలు ఉండగా విడోస్ డిఫెన్స్ పర్సనల్ కు సంబంధించి 2 ఖాళీలు ఉన్నాయి. 20 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి 2021 అక్టోబర్ 1 లోపు ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభమైంది. http://joinindianarmy.nic.in/ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.