ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 85 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లను విడుదల చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రైవేట్ సంస్థల్లోని ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న సంగతి విదితమే. తాజాగా ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి 85 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటకు చెందిన టెక్స్ టైల్ పరిశ్రమలో టెక్నీషియన్ […]

Written By: Navya, Updated On : December 5, 2020 8:42 pm
Follow us on


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లను విడుదల చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రైవేట్ సంస్థల్లోని ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న సంగతి విదితమే. తాజాగా ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి 85 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.

ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటకు చెందిన టెక్స్ టైల్ పరిశ్రమలో టెక్నీషియన్ కిట్టింగ్, ఆపరేటింగ్ సీమింగ్, ఆపరేటర్ క్నిట్టింగ్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా డిసెంబర్ 10 దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు చదువు, అర్హతను బట్టి 13,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఐటీఐ లేదా డిప్లొమా చదివిన వాళ్లు టెక్నీషియన్ క్నిట్టింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అర్హులు. ఆపరేటర్ సీమింగ్ ఉద్యోగాలకు పురుషులతో పాటు స్త్రీలు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆపరేటర్ క్నిట్టింగ్ ఉద్యోగాలకు ఐటీఐ, డిప్లొమా చేసిన స్త్రీ పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ విబాగంలో ఐటీఐ చేసిన వాళ్లు ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు అదనపు సౌకర్యాలు సైతం లభిస్తాయి.