Also Read: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 85 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?
ప్రధానంగా పంజాబ్ రైతులు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఢిల్లీబాట పడుతున్నారు. గత పదిరోజులుగా ఢిల్లీలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే రైతులను పలుమార్లు కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. గురువారం సైతం కేంద్రంతో రైతులు చర్చించినా ఎలాంటి ఫలితం లేకుండానే అసంతృప్తిగా నిలిచాయి.
ఈనేపథ్యంలోనే శనివారం మరోసారి రైతులతో చర్చించేందుకు కేంద్రం సిద్ధమైంది. నేడు రైతు సంఘాలతో జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. చర్చలు జరుగుతున్న సమయంలో కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ బయటకు వెళ్లిపోయారు. దీంతో సోమవారం మరోసారి చర్చలకు కేంద్రం ప్రతిపాదించింది. అనంతరం రైతుల సంఘాల నేతలు సైతం అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోయారు.
Also Read: టీపీసీసీ రేసులో జగ్గారెడ్డి.. జీహెచ్ఎంసీ ఫలితాలపై సంచలన కామెంట్స్!
ఈసందర్భంగా రైతులు సంఘాల నేతలు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈనెల 8న భారత్‌బంద్ చేపడుతామని హెచ్చరించారు. దీంతోపాటు ఢిల్లీలోనే ఏడాదిపాటు ఆందోళన కార్యక్రమాలు చేస్తామంటూ స్పష్టం చేశారు. దీంతో రైతులు ఆందోళనలు తీవ్రతరం అయ్యేలా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే చర్చలైనా ఫలిస్తాయా? లేదా అనే ఉత్కంఠత నెలకొంది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్