APSSDC Job Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. టీసీఎల్, రైజింగ్ స్టార్స్, హీరో మోటో కార్ప్, టెక్ టీమ్ సొల్యూషన్స్, వీల్స్ మార్ట్ సంస్థలలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత, ఆసక్తి కలిగి ఉంటారో వాళ్లు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆగష్టు 31వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూ ప్రారంభమవుతుంది. విజయనగరం జిల్లాలోని ఆర్.కే జూనియర్ కాలేజీ అండ్ డిగ్రీ కాలేజీలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. టీసీఎల్ సంస్థ అసెంబ్లీ/రీ వర్క్/టెస్టింగ్ సెక్షన్ లో 100 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్ల వయస్సు 19 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు చిత్తూరు జిల్లాలోని రేణిగుంటలో పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 12,014 రూపాయల వేతనం లభిస్తుంది. వేతనంతో పాటు ఫ్రీగా భోజనం, వసతి, రవాణా సదుపాయం కల్పిస్తారు. రైజింగ్ స్టార్ లో 100 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఎంపికైన వాళ్లకు 10,200 రూపాయల వేతనం లభిస్తుంది. ఎంపికైన వాళ్లు శ్రీ సిటీలో పని చేయాల్సి ఉంటుంది.
హీర్ మోటో కార్ప్ లో 100 ఉద్యోగ ఖాళీలు ఉండగా రూ.14,977 వేతనంగా లభిస్తుంది. టెక్ టీమ్ లో 5 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఏడాదికి 1,80,000 వరకు వేతనం ఉంటుంది. వీల్స్ మార్ట్ లో వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఉండగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 10,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. https://apssdc.in/home/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి.