ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 499 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. నాడు నేడు పనుల ద్వారా జగన్ సర్కార్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో ఖాళీలను భర్తీ చేసిందుకు ప్రభుత్వం సిద్ధమైంది. Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. రాత పరీక్ష లేకుండా 50వేల వేతనంతో ఉద్యోగాలు..? రాష్ట్ర […]

Written By: Navya, Updated On : December 22, 2020 1:56 pm
Follow us on


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. నాడు నేడు పనుల ద్వారా జగన్ సర్కార్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో ఖాళీలను భర్తీ చేసిందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. రాత పరీక్ష లేకుండా 50వేల వేతనంతో ఉద్యోగాలు..?

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 499 డాక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 13 జిల్లాలలో ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. ఉద్యోగ ఖాళీలను పరిశీలిస్తే గుంటూరులో 66 ఖాళీలు, విశాఖపట్నంలో 64 ఖాళీలు, కృష్ణా జిల్లాలో 58 ఖాళీలు, అనంతపురం జిల్లాలో 44 ఖాళీలు, కర్నూలు జిల్లాలో 40 ఖాళీలు, తూర్పుగోదావరి జిల్లాలో 39 ఖాళీలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 35 ఖాళీలు, చిత్తూరు జిల్లాలో 33 ఖాళీలు ఉన్నాయి.

Also Read: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. కంపెనీలకు హెచ్చరిక..?

శ్రీకాకుళం జిల్లాలో 13, విజయనగరం జిల్లాలో 20, ప్రకాశం జిల్లాలో 25, నెల్లూరు జిల్లాలో 29, కడప జిల్లాలో 33 ఖాళీలు ఉన్నాయి. 13 జిల్లాలకు వేర్వేరు నోటిఫికేషన్లు వెలువడగా జిల్లా వెబ్ సైట్ల ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఉద్యోగాల దరఖాస్తులకు సంబంధించిన చివరి తేదీలు వేర్వేరుగా ఉన్నాయి. ఎంపికైన వారికి అర్హత, అనుభవాన్ని బట్టి వేతనం లభిసుంది.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

దరఖాస్తులకు వేర్వేరు తేదీలు జిల్లాలను బట్టి ఉండటంతో అభ్యర్థులు జిల్లా వెబ్ సైట్ లలో నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 13 జిల్లాల కలెక్టర్ల నుంచి ఈ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.