
కరోనా వ్యాక్సిన్ నిర్మూలనకు హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ‘కోవాగ్జిన్ ’టీకాను అభివ్రుద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటి వరకు 13 వేల మంది వలంటీర్లకు ‘కోవాగ్జిన్’ ఇచ్చినట్లు సంస్థ ప్రకటించింది. మొత్తం 26 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు నిర్ణయించుకొనగా అందుకోసం ముందుకు సాగుతున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. భారతదేశంలో భారీ ఎత్తున్న ట్రయల్స్ నిర్వహించడం ఇదే మొదటిసారి. కోవిడ్ -10 సహకరించిన వలంటీర్లకు భారత్ బయోటిక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా కృతజ్ఞతలు తెలిపారు.