ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నారా.. కొత్త కార్డు ఎలా పొందాలంటే..?

భారతదేశంలో నివశించే ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. పాన్ కార్డు, రేషన్ కార్డులా ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్ కాగా ఆధార్ కార్డ్ ఉంటే మాత్రమే ఎన్నో పథకాలకు అర్హత పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఆధార్ కార్డును పోగొట్టుకుంటే కొన్నిసార్లు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఆధార్ కార్డును పోగొట్టుకున్నా ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా ఆధార్ కార్డును […]

Written By: Navya, Updated On : June 29, 2021 9:32 am
Follow us on

భారతదేశంలో నివశించే ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. పాన్ కార్డు, రేషన్ కార్డులా ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్ కాగా ఆధార్ కార్డ్ ఉంటే మాత్రమే ఎన్నో పథకాలకు అర్హత పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఆధార్ కార్డును పోగొట్టుకుంటే కొన్నిసార్లు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఆధార్ కార్డును పోగొట్టుకున్నా ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు.

యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా ఆధార్ కార్డును సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒకే ఒక సింగిల్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా కార్డును డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కలుగుతుంది. https://eaadhaar.uidai.gov.in/ లింక్ ద్వారా సులభంగా ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవడం సాధ్యమవుతుంది. యూఐడీఏఐ ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా ఆధార్ కార్డు డౌన్ లోడ్ గురించి వెల్లడించింది.

ఆధార్ నంబర్, ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ కు సంబంధించిన నంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా ఆధార్ కార్డును సులభంగా డౌన్ లోడ్ చేసుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఈ లింక్ ద్వారా మాస్క్‌డ్ ఆధార్ కావాలన్నా సులభంగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆధార్ కార్ద్ పోగొట్టుకున్న వాళ్లు ఏ మాత్రం కంగారు పడకుండా ఈ విధంగా కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అయితే మొబైల్ నంబర్ ఆధార్ కార్డుకు లింక్ అయ్యి ఉంటే మాత్రమే ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా ఎన్నిసార్లు అయినా సులభంగా ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.