ఎమ్మెల్సీ హోదా సోము వీర్రాజు కోల్పోతారా?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీరరాజు తన ఎంఎల్‌సి హోదాను కోల్పోయేలా ఉన్నారు. ఆయన పదవీకాలం ఈనెల మే 31తో ముగియనుంది. ఈనెలాఖరుతో పదవీకాలం ముగిసే ముగ్గురు ఎంఎల్‌సిలలో సోము వీర్రాజు కూడా ఒకరు. మిగతా ఇద్దరు ఎవరంటే కౌన్సిల్ చైర్‌పర్సన్ మహ్మద్ అహ్మద్ షరీఫ్ కాగా, వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి. ఈ మూడు సీట్లు ప్రస్తుత బలాబాలల ప్రకారం వైఎస్‌ఆర్‌సిపికే వెళ్లే అవకాశం ఉంది. గత చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీతో పొత్తు పెట్టుకొని […]

Written By: NARESH, Updated On : May 15, 2021 8:19 pm
Follow us on

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీరరాజు తన ఎంఎల్‌సి హోదాను కోల్పోయేలా ఉన్నారు. ఆయన పదవీకాలం ఈనెల మే 31తో ముగియనుంది. ఈనెలాఖరుతో పదవీకాలం ముగిసే ముగ్గురు ఎంఎల్‌సిలలో సోము వీర్రాజు కూడా ఒకరు. మిగతా ఇద్దరు ఎవరంటే కౌన్సిల్ చైర్‌పర్సన్ మహ్మద్ అహ్మద్ షరీఫ్ కాగా, వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి. ఈ మూడు సీట్లు ప్రస్తుత బలాబాలల ప్రకారం వైఎస్‌ఆర్‌సిపికే వెళ్లే అవకాశం ఉంది.

గత చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీతో పొత్తు పెట్టుకొని టీడీపీ గెలిచింది. దీంతో నాడు బీజేపీకి ఎమ్మెల్సీ పదవిని టీడీపీ అధినేత నాటి, సీఎం చంద్రబాబు కేటాయించారు. అలా సోము వీర్రాజు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ పదవీ కాలం నేటితో ముగుస్తోంది.

ఇక నుంచి సోము వీరరాజుకు కేవలం పార్టీ అధ్యక్ష పదవి మాత్రమే ఉండనుంది. ఆయనకు ఇతర పదవులు ఉండవు. బీజేపీకి ఏపీ శాసనమండలిలో.. బయట బలం లేకపోవడంతో మరోసారి ఎమ్మెల్సీ పదవి సోము వీర్రాజుకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

ఇక ఈ మూడు ఎమ్మెల్సీ పదవులు అధికార వైసీపీ సొంతం కానుంది. కేంద్రంలోని బీజేపీతో వైసీపీకి ఎలాంటి పొత్లు లేకపోవడంతో ఈ ఎమ్మెల్సీ పదవిని సోము వీర్రాజుకు జగన్ ఇచ్చే పరిస్థితి లేదు. బీజేపీ జాతీయ నాయకత్వం వీరరాజుకు ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరితే జగన్ ఇచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఏపీలో సోము వీరరాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలి తిరుపతి ఉప ఎన్నిక.. స్థానిక సంస్థలకు ఎన్నికల్లో అధికార వైయస్ఆర్సిపికి ప్రత్యామ్నాయంగా మారడానికి పార్టీని సమాయత్తం చేశారు. ఏపీ ప్రత్యేక హోదా సమస్య, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య చుట్టూ ఉన్న ప్రతికూలత కారణంగా ఏపీలో పార్టీ విజయం సాధించలేకపోయింది. వీరరాజు పార్టీని పటిష్టం చేయడానికి జనసేనతో పొత్తు పెట్టుకొని ప్రస్తుతం ముందుకు సాగుతున్నారు.

ఇప్పుడు ఆయనకున్న ఎంఎల్‌సి హోదా ఈ నెలాఖరుతో పోనుంది. పార్టీ పనుల కోసం పూర్తి సమయం సోము వీర్రాజు అంకితం చేయనున్నారు. పార్టీకి మద్దతు సమీకరించటానికి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే పనిలో పడ్డారు. పార్టీని బలోపేతం చేయడానికి, బిజెపి అనుకూల వాదాన్ని రూపొందించడానికి కృషి చేస్తున్నారు.