
గత కొన్ని రోజుల నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. తాజాగా దేశంలోని పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు చెందిన పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) 35 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://dgca.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని డిజీసీఏ కల్పిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 16వ తేదీలోగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఫ్లయిట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్, సీనియర్ ఫ్లయిట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్, డిప్యూటీ చీఫ్ ఫ్లయిట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ , ఫ్లయిట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలను డీజీసీఏ భర్తీ చేయనుంది.
టెక్నికల్ అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేయాలనుకునే వాళ్లు నవంబర్ 20, 2020 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు లక్షల రూపాయల వేతనం పొందే ఛాన్స్ ఉంటుంది.
ఇతర ఉద్యోగాలతో పోల్చి చూస్తే ఈ ఉద్యోగాలకు పోటీ తీవ్రంగానే ఉంటుంది. అందువల్ల ఎంతో కష్టపడితే తప్ప ఈ ఉద్యోగాలకు అర్హత సాధించడం సాధ్యం కాదు. అందువల్ల ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెక్నికల్ అంశాలపై పట్టు పెంచుకుంటే సులువుగా ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.