
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేర్చాలనే ఉద్దేశంతో గ్రామ, వార్డ్ సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసి ఆ ఉద్యోగాలను భర్తీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల కోసం ప్రజలు గ్రామ, వార్డ్ సచివాలయ సేవలను వినియోగించుకుంటున్నారు.
Also Read: జగన్ సర్కార్ కు అశ్వినీదత్ ఝలక్.. కౌంటర్ కూడా ఇవ్వలేరా?
ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో జగన్ సర్కార్ గ్రామ, వార్డ్ సచివాలయాల్లోని 16,208 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసిందుకు నోటీఫికేషన్ ను విడుదల చేసి గత నెలలో పరీక్ష ఫలితాలను వెల్లడించింది. తాజాగా జగన్ సర్కార్ గ్రామ, వార్డ్ సచివాలయాల అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని గ్రామ, వార్డ్ సచివాలయాల అభ్యర్థులు ఇకపై డ్రెస్ కోడ్ ను పాటించాల్సి ఉంటుంది.
Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు..?
ప్రభుత్వం మొదట రాష్ట్రంలోని కొన్ని సచివాలయాలను ఎంపిక చేసి ఆ సచివాలయాల్లోని సిబ్బందికి డ్రెస్ కోడ్ ను అమలు చేయనుంది. అనంతరం ప్రజలు, సిబ్బంది నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా డ్రెస్ కోడ్ ను అమలుచేయనుంది. పురుష ఉద్యోగులకు స్కై బ్లూ షర్ట్, బిస్కెట్ కలర్ ప్యాంట్, మహిళా ఉద్యోగులకు స్కై బ్లూ టాప్, బిస్కెట్ కలర్ లెగిన్‌ను జగన్ సర్కార్ డ్రెస్ కోడ్ గా అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
రాష్ట్రంలో భారీ సంఖ్యలో గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులను నియమించిన నేపథ్యంలో ప్రభుత్వం డ్రెస్ కోడ్ అమలు ద్వారా సచివాలయాల వ్యవస్థలో మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నిర్ణయం ఎప్పటినుండి అమలులోకి వస్తుందో తెలియాల్సి ఉంది.